పెండింగ్ లో ఉన్న 5 నెలల వేతనాన్ని తక్షణమే చెల్లించాలి -రాష్ట్ర నాయకులు సదానందం.

నాగర్ కర్నూల్ రూరల్ డిసెంబర్11(జనంసాక్షి):నాగర్ కర్నూల్ జిల్లా 1145అతిథి అధ్యాపక సంఘం నూతన జిల్లా కమిటీని రాష్ట్ర కమిటీ బాధ్యులు ఆయిల్ సదానందం గౌడు సమక్షంలో ఆదివారం జిల్లా కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అతిధి అధ్యాపకుల సమావేశంలో సదానందం గౌడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 405ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1664మంది అతిథి అధ్యాపకులుగా గత 8ఏండ్లుగా సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తు ఇంటర్ విద్య బలోపేతానికి అహర్నిశలుగా కృషి చేస్తున్నారన్నారు.ఈ విద్యా సంవత్సరం పెండింగ్ లో ఉన్న 5 నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్నికి విన్నవించారు అదేవిధంగా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు అనంతరం నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.
*నూతన జిల్లా కమిటీ ఎన్నిక*
నూతన జిల్లా అధ్యక్షునిగా కావలి కృష్ణ,అసోసియేట్ ప్రెసిడెంట్ గా కుర్మయ్య,ప్రధాన కార్యదర్శిగా రవీందర్ రెడ్డి,కోశాధికారిగా భీమేశ్వర్,వర్కింగ్ ప్రెసిడెంట్ గా రమేష్,జిల్లా ఉపాధ్యక్షులుగా శ్రీను,పురుషోత్తం,ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆంజనేయులు ప్రచార కార్యదర్శిగా గంధం.నాగరాజు,మహిళా అధ్యక్షురాలుగా అరిణి,అధికార ప్రతినిధిగా శివశంకర్ ని ఎన్నుకోవడం జరిగింది.గెస్ట్ లెక్చరర్ల హక్కుల కోసం బాధ్యతగా కృషి చేస్తానని నూతన అద్యక్షుడు కావలి.కృష్ణ,ప్రధాన కార్యదర్శి రవింధర్ రెడ్డిపేర్కొన్నారు.