పెంపుడు కుక్కలకు ఆంటీ రేబీస్ టీకా ఇప్పించాలి
పశు వైద్య అధికారి సుభాష్.
ఎల్లారెడ్డి 06 జులై (జనంసాక్షి )…. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం లో ప్రపంచ జూనోస్ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి ప్రభుత్వ పశు వైద్య శాల లో డాక్టర్ సుభాష్ ఆధ్వర్యం లో బుదవారం పెంపుడు కుక్కలకు టీకా లు ఇచ్చారు ఈ సందర్భంగా పశు వైద్యాధికారి ఏ డి సుభాష్. మాట్లాడుతూ పెంపుడు కుక్కలకు పిచ్చి కుక్కలు మీద పడి గాయపరిచిన రక్కిన గిరినా గాని ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా టీకాలు ఇస్తున్నట్లు తెలిపారు పెంపుడు కుక్కలను పెంచుకునే వారు రేబిస్ టీకాలు కుక్కలకు ఇప్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ కామారెడ్డి పశు వైద్య అధికారి అసిస్టంట్ డైరక్టర్ సంజయ్ కుమార్ .గోపాల మిత్రు కు సంబంధించిన శ్రీనివాస్ రెడ్డి సలీమ్ రమేష్ తదతరులు పాల్గొన్నారు