పెంబట్ల శ్రీ దుబ్బరాజన్న ఆదాయంను సర్దుబాటు చేశారా? స్వాహా చేశారా ?
సారంగపూర్ (జనంసాక్షి) 18 అక్టోబర్
సారంగాపూర్ మండలంలోని, శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి, ఆలయ పరిసరాల్లో టెంకాయలు, బెల్లం, పూజా సామాగ్రి అమ్మకాల నిర్వహణకై 2019-20 నిర్వహించిన వేలంలో ₹ 5,95,000/- ఓ వ్యాపారి దక్కించుకున్నాడు. ఆలయ ఖజానాకు. ₹ 3,00000/- చెల్లించినట్టు రికార్డులో నమోదయింది. మిగతా.₹ 2,95,000 /- సొమ్మును ఈ సంవత్సర ఆలయ రికార్డులలో నమోదు కానట్టు సమాచారం.
కోడెల అమ్మకంలో ₹ 10,000/-
దుబ్బ రాజేశ్వర స్వామికి, చెందిన కోడెల వేలం, అమ్మకం ద్వారా ₹ ,21,000/- కు ఓ వ్యక్తి కొనుగోలు చేసినట్టు రికార్డులో నమోదయింది. మొత్తం డబ్బులు చెల్లించకుండా కేవలం ₹ 11,000/- సొమ్ము చెల్లించినట్టు రికార్డులో ఉంది. వీటికి సంబంధించిన ₹ 10,000/- ఆలయ ఖజానాకు జమ చేశారా? లేదా ? అనే విషయంలో స్పష్టత లేదు. కోడెల అమ్మకంకు సంబంధించిన రికార్డులు అదృశ్యమైనట్టు సమాచారం.ఈ అంశంపై ప్రభుత్వం, ఆలయ అధికారులను వివరణ కోరినట్టు తెలిసింది. చిల్లర పనులలో ₹ 3,54,120/- ఆలయంలో చిల్లర పనులకు, మరమ్మతులకు, సంబంధించి ₹ 3,54,120/- రూపాయలు ఖర్చు చేసినట్టు అధికారులు రికార్డులో నమోదు చేశారు. ఈ పనులను ఇంజనీరింగ్ అధికారులు, అంచనాలు సిద్ధం చేసి, దేవాదాయ శాఖ, ఉన్నతాధికారుల ఆమోదం పొందిన తర్వాత పనులు చేపట్టాలి అనే ఆదేశాలు ఉన్నాయి. ఇలాంటి ఆదేశాలను పట్టించుకోకుండా , ఎలాంటి అధికారిక. ధ్రువీకరణ పత్రాలు లేకుండా, చేతి రాత రసీదుల, ద్వారా లక్షలాది రూపాయలు చెల్లించినట్టు రికార్డులు నమోదయింది.
ఫర్నిచర్, డీజిల్ కొనుగోలులో ₹,1,14,997/-ఆలయ నిధుల నుండి ₹, 69,997/- డ్రాచేసి, ఫర్నిచర్ కొనుగోలు నిమిత్తం వ్యయం చేసినట్టు రికార్డులో పేర్కొనబడింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల సంఖ్య.95/B/45/TFR/018, తేదీ 16-04-2018 ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతి లేనిదే, ఎలాంటి ఫర్నిచర్, కొనుగోలు చేయరాదు అంటూ, ఫర్నిచర్ కొనుగోలు పై నిషేధం విధించినట్టు ఉత్తర్వులలో పేర్కొనబడింది. ప్రభుత్వ ఆదేశాలు తుంగలో తొక్కి అధికారులు ఫర్నిచర్ కొనుగోలు చేసినట్టు రికార్డులలో, నమోదు చేసినట్టు సమాచారం. దీనికి తోడు ఆలయంలోని జనరేటర్ వినియోగం కోసం ₹ 45,000/- వెచ్చించి డీజిల్ కొనుగోలు చేసినట్టు నమోదు చేశారు. అయితే డీజిల్ కొనుగోలు వివరాలు, లాగ్ బుక్ లో తేదీల వారీగా, నమోదు కాకపోవడంతో పాటు, కంప్యూటర్, ప్రింటెడ్, రసీదు వివరాలు రికార్డులో లేనట్టు తెలిసింది.