పెగాసస్‌తో భారత్‌కు ఎలాంటి సంబంధం లేదు

ఆ సంస్థతో ఎలాంటి అవగాహనా లేనేలేదు
రాజ్యసభలో ప్రకటించిన కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి
పార్లమెంట్‌లో దుమారం చెలరేగుతున్న వేళ సిపిఎం ఎంపి ప్రశ్న
లిఖఙతపూర్వక సమాధానం ఇచ్చిన సహాయమంత్రి అజయ్‌ భట్‌
న్యూఢల్లీి,ఆగస్ట్‌9(జనంసాక్షి): పెగాసస్‌తో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం తేల్చేసింది. విపక్షాలు చేస్తున్న ఆందోళనల క్రమంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను తీవ్రంగా కుదిపేస్తోన్న పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై ఎట్టకేలకు కేంద్రం పెదవివిప్పింది. ఆ స్పైవేర్‌ తయారీ సంస్థ, ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌తో తాము ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని కేంద్ర రక్షణశాఖ సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది. ఆ స్పైవేర్‌ తయారీ సంస్థ, ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌తో తాము ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని కేంద్ర రక్షణశాఖ సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది. ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ టెక్నాలజీస్‌తో రక్షణశాఖకు ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా..? అని సీపీఎం ఎంపీ వి. శివదాసన్‌ రాజ్యసభలో ప్రశ్నించారు. ఒకవేళ ఉంటే వాటి వివరాలు చెప్పాలని అడిగారు. ఇందుకు రక్షణశాఖ సహాయమంత్రి అజయ్‌ భట్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఎన్‌ఎస్‌వో గ్రూప్‌తో రక్షణశాఖ ఎలాంటి లావాదేవీలు జరపలేదని స్పష్టం చేశారు. ఆ సంస్థ అభివృద్ధి చేసిన పెగాసస్‌ స్పైవేర్‌తో భారత్‌ సహా పలు దేశాలు ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఇటీవల సంచలన కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో దుమారం చెలరేగుతోంది. ఈ క్రమంలో కేంద్రం చేసిన ప్రకటన కీలకం కానుంది. ఈ స్పైవేర్‌ లక్షిత జాబితాలో భారత్‌కు చెందిన దాదాపు 300 మంది ఉన్నారని ఇప్పటికే కథనాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, సీబీఐ అధికారులు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల ఫోన్లను హ్యాక్‌ చేసినట్లు కథనాలు వచ్చాయి. ఈ సంస్థ అభివృద్ధి చేసిన పెగాసస్‌ స్పైవేర్‌తో భారత్‌ సహా పలు దేశాలు ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఇటీవల సంచలన కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. సరిగ్గా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక్క రోజు ముందు జులై 18న ఈ కథనాలు వెలువడ్డాయి. దీంతో ఈ అంశంపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడుతూ ఉభయసభ ల్లో ఆందోళనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్‌ ఉభయసభల్లో చర్చలకు ఆస్కారం లేకుండా వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు పెగాసస్‌ కథనాలను కేంద్రం కొట్టిపారేసింది. భారత ప్రజాస్వామ్యానికి చెడ్డపేరు తేవడమే లక్ష్యంగా కొందరు ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలే అని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ అన్నారు. భారత్‌లో అనధికారిక నిఘా సాధ్యం కాదని, ఇక్కడ చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం దీనిపై పార్లమెంటరీ స్థాయి దర్యాప్తునకు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే దీనిపై ప్రతిపక్షాలు ఏ మేరకు శాంతిస్తాయో చూడాలి.
కాగా, నిఘా, ఇంటెలిజెన్స్‌ సమాచార సేకరణకు సంబంధించిన పెగాసస్‌ స్పైవేర్‌ వినియోగం గురించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేదా క్యాబినెట్‌ సెక్రటేరియట్‌ వంటి ఇతర మంత్రిత్వ శాఖలు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. పెగాసస్‌ స్పైవేర్‌ ద్వారా అనేక మంది ప్రతిపక్ష నేతలు, న్యాయవ్యవస్థకు చెందిన వారు, ప్రభుత్వంపై విమర్శలు చేసే జర్నలిస్టులు, కొందరు కేంద్ర మంత్రులు, మంత్రిత్వ శాఖల సిబ్బంది, సైనిక అధికారులతోపాటు పలువురి మొబైల్‌ ఫోన్లు హ్యాక్‌
అయినట్లు ది వైర్‌ పలు సంచలన కథనాలను ప్రచురించింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను ఈ అంశం కుదిపేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

తాజావార్తలు