పెట్టుబడి సాయం దేశానికే ఆదర్శం: ఎంపి గోడం నగేశ్
ఆదిలాబాద్,మే4(జనం సాక్షి ): రైతుకు పెట్టుబడి సాయం చేసే పథకం ఇతర రాష్ట్రాలను ఆకర్శిస్తుండగా.. రాష్ట్రంలోని ప్రతిపక్ష కాంగ్రెస్‌కు వణుకు పుట్టిస్తున్నదని ఎంపి గోడం నగేశ్ అన్నారు. ఇది దేశంలోనే ఓ సంచలన నిర్ణయమని అన్నారు. ఇప్పటికే దేశ రాజకయీఆలపై దృష్టి సారించిన సిఎం కెసిఆర్ రైతుబందు పథకంతో పాపులర్ అయ్యారని అన్నారు. ఢి/-లలీలో ఈ పథకంపై తరచూ ఆరా తీస్తున్నారని అన్నారు.
రైతుబంధు పథకం అమలు చేస్తున్న మే 10వ తేదీ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. రాష్ట్రంలో రైతాంగంతోపాటు అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ దానికి సమాంతరంగా అభివృద్ధి చేస్తుండటంతో ప్రతిపక్ష పార్టీలకు రాజకీయ భవిష్యత్ లేకుండా పోతున్నదని అన్నారు. ఈ పతకం గొప్పదనాన్ని గుర్తించి విమర్శలు చేయడం మానుకోవాలని అన్నారు. 24 గంటల విద్యుత్ ఇచ్చినా విమర్శలు చేయడం చూస్తుంటే కాంగ్రెస్ ఎంతగా దిగజారి పోయిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రాఎక్టుఉల కడుఉతంటే అభివృద్ధిని అడ్డుకునేందుకు కోర్టుమెట్లు ఎక్కుతూ కేసులు వేస్తున్న తీరు కాంగ్రెస్ దుస్థితికి నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాలు గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోయారో చెప్పాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయమన్నారు.