పెట్టుబడులకు రెడ్‌కార్పేట్
-పరిశ్రమల స్థాపనకు పక్షంరోజుల్లో అనుమతులు
-సీఎం కేసీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులకు రెడ్ కార్పెట్ వేస్తామని పరిశ్రమల స్థాపనలకు తెలంగాణే అనువైన ప్రాంతమని, ప్రపంచం గర్వించదగ్గ పారిశ్రామిక విధానం ఉంటుందని
సీఎం కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లా ముప్పిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేయనున్న శాంతాబయోటెక్ ఇన్సులిన్ పరిశ్రమకు గురువారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ… రాష్గానికి మరిన్ని పరిశ్రమలు రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. నూతన పారిశ్రామిక విధానం ద్వారా అన్ని వసతులు కల్పిస్తామని ప్రకటించారు. పెట్టుబడి దారులను తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. పరిశ్రమల స్థాపనకు 15 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తామని స్పస్టం చేశారు. పట్టుదలతో, ప్రజ్ఞా పాఠవాలతోడాక్టర్ వరప్రసాద్ శాంతా బయోటెక్ ఇన్సులిన్ పరిశ్రమను స్థాపించారన్నారు. కలరా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసిన మ¬న్నత వ్యక్తి వరప్రసాద్ అని కొనియాడారు. ఇకపై విపణిలో ఇన్సులిన్ అతి తక్కువ ధరకు లభించబోతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, ఉప సభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి, శాంతా బయోటెక్ పరిశ్రమ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.