పెట్టుబడులకు స్వర్గధామం భారత్‌: ప్రధాని నరేంద్ర మోడీ

1

ముంబై,ఫిబ్రవరి14(జనంసాక్షి):పెట్టుబడులకు భారతే స్వర్గధామమని ప్రధాని నరేంద్ర మోదీ మేక్‌ ఇన్‌ ఇండియా ప్రాజెక్టు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపార విధానాలను సులభతరం చేస్తామని, అనుకూల వాతావరణం కల్పిస్తామని మోదీ హావిూ ఇచ్చారు. ఇందుకు ఇప్పటికే కార్యాచరణ చేపట్టామని అన్నారు.  శనివారం పూణెలో జరిగిన వస్తు ఉత్పత్తి సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో భారత్‌ 7.4 జీడీపీతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని వెల్లడించారు. భారత్‌లో అనేక అవకాశాలు ఉన్నాయని.. అభివృద్ధి, ఉద్యోగకల్పన విషయంలో తాను భరోసా కల్పిస్తున్నాని స్పష్టం చేశారు. రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాకు చెందిన పలు కంపెనీలను ఆహ్వానించారు. భారతదేశ భౌగోళిక పర్థసితుల దృష్ట్యా వస్తు ఉత్పత్తికి అపారమైన అవకాశాలు ఉన్నాయని వివరించారు. భారత్‌ రైల్వే రంగంలో మరింత అభివృద్ధి సాధించాలని మోదీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిఎం ఫడ్నవీస్‌ తదితరులు పాల్గొన్నారు.