పెట్రోల్‌ తగ్గింది.. డీజిల్‌ పెరిగింది..

4
న్యూఢిల్లీ,ఫిబ్రవరి 17(జనంసాక్షి): పెట్రోల్‌ ధర లీటర్‌ కు 32 పైసలు తగ్గింది. డీజిల్‌ ధర కాస్త పెరిగింది. లీటర్‌ డీజిల్‌ కు 28 పైసలు పెంచినట్టు చమురు సంస్థలు బుధవారం వెల్లడించాయి. కొత్త ధరలు ఈ అర్ధరాత్రి నుంచే అమలవుతాయని పేర్కొన్నాయి. జనవరి 15న పెట్రోల్‌ పై 32 పైసలు, డిజిల్‌ పై 85 పైసలు తగ్గించాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గుతున్న ఆ ప్రయోజనం వినియోగదారులకు దక్కడం లేదు. పెట్రోల్‌ ధర తగ్గించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీని పెంచుతోంది. జనవరి 30న  పెట్రోల్‌పై లీటర్‌కు రూపాయి, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి 50 పైసలు చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచింది. జనవరి నెలలోనే 2వ తేదీన లీటర్‌ పెట్రోల్‌పై 37

పైసలు, డీజిల్‌ పై లీటరుకు రెండు రూపాయల చొప్పున ఎక్సైజ్‌ సుంకం పెంచింది. దీంతో వినియోగదారులకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదు.