పెట్రోల్ కొరతపై పుకార్లు షికార్లు

` బంకుల వద్ద భారీగా క్యూలైన్లు
` నగరంలో పలుచోట్ల పెట్రో బంకుల ముందు నోస్టాక్ బోర్డులు
హైదరాబాద్(జనంసాక్షి):అమెరికా`ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో భారతదేశ వ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్‌కు కొరత ఏర్పడింది. కొన్ని రోజులుగా ప్రజలు వంట గ్యాస్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా పెట్రోల్ నిల్వలు కూడా దేశంలో తగ్గిపోయాయన్న ప్రచారంతో బంకుల ముందు వాహనదారులు క్యూ కడుతున్నారు. తెలుగు రాష్టాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. క్యూ కట్టి మరీ బంకుల నుంచి పెద్దఎత్తున ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోనూ అవసరం లేకున్నా లీటర్ల కొద్దీ పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు వాహనదారులు. దీంతో పలు బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయి. నగర వ్యాప్తంగా చాలా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడంతో ప్రజలు మరింతగా ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్ కొరతతో ఇబ్బందులు తప్పవన్న వదంతులే ఇందుకు కారణం. అయితే, దీనిపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది.్గªలంగాణలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని తెలిపింది. రాష్ట్ర ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచించింది. పీఆరఎస్‌వో(ఖఖాక్ష)లకి విరుద్ధంగా ప్రజలు, బంకుల యాజమాన్యాలు ప్రవర్తించవద్దని చెప్పింది. అవసరాన్ని బట్టి మాత్రమే పెట్రోల్, డీజిల్ కొనాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. సప్లయ్ చైన్స్ సరిగ్గా పని చేస్తున్నాయని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపింది. మరోవైపు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అడ్వైజరీ జారీ చేసింది. పెట్రోల్, డీజిల్ కొరత వదంతులు పూర్తిగా నిరాధారమైనవని తెలిపింది. భారతదేశంలో పుష్కలంగా ఇంధన నిల్వలు ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా సరఫరా నడుస్తోందని.. బీపీసీఎల్ పూర్తిస్థాయిలో పనిచేస్తోందని అడ్వైజరీలో తెలిపింది. పెట్రోల్, డీజిల్ కొరతతో రాష్ట్రవ్యాప్తంగా వాహనదారుల ఆందోళన నేపథ్యంలో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పందించింది. పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వదంతులు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. సోషల్‌విÖడియాలో వస్తున్న ప్రచారాలతో తప్ప్పుడు ప్రచారాల కారణంగా ప్రజలు అనవసరంగా పెట్రోల్ బంకులను పరుగులు తీస్తూ, ట్యాంకులు నింపుకుంటున్నారని తెలిపింది. ఈ భయాందోళనల కారణంగా సాధారణ స్థాయి కంటే 2.5 నుంచి 3 రెట్లు అధికంగా అమ్మకాలు జరుగుతు న్నాయని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో తాత్కాలి కంగా ఇంధన నిల్వలు తగ్గినట్లు కనిపిస్తున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని స్పష్టంచేసింది. ఊఖఅఒ, ఎక్షఅఒ, ఃఖఅఒ సంస్థల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని.. సరఫరా వ్యవస్థ సక్రమంగా కొనసాగుతుందని తెలిపింది. పెట్రోల్ లేదా డీజిల్‌ను క్యాన్లలో నిల్వ చేయడం ప్రమాదకరమని.. ఇది ఖఇªSక్ష నిబంధనలకు విరుద్ధమని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఇంధనాన్ని తప్ప్పుగా నిల్వ చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం తెలిపింది. భయాందోళనలతో అధికంగా ఇంధనాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని సూచించింది.