పెట్రో ధరలను 25 వరకు తగ్గించవచ్చు: చిదంబరం

న్యూఢిల్లీ,మే23( జ‌నం సాక్షి): : రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ప్రభుత్వానికి తగ్గించాలని చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్‌పై సుమారు రూ. 25 తగ్గించే అవకాశం ఉందని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధర తగ్గినప్పుడల్లా ప్రభుత్వానికి ప్రతి లీటర్‌పై రూ. 15 ఆదా అవుతుందని, అదనంగా ప్రతి లీటర్‌పై రూ. 10 పన్ను ఎలాగూ ఉందని ఈవిధంగా ప్రభుత్వానికి 25 లాభం చేకూరుతోందని ఆయన వివరించారు. ఈ డబ్బంతా సగటు వినియోగదారుడిగా భారమై కేంద్రానికి ఆదాయంగా లభిస్తోందన్నారు. కానీ ధరలు తగ్గించాల్సి వచ్చినపుడు కేవలం రూ.1 లేదా గరిష్టంగా రూ2 తగ్గించి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.