పెట్రో ధరలపై రైతుల ర్యాలీ

సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసనలు
చండీఘడ్‌,మే29(జ‌నం సాక్షి): పెరగుతున్న పెట్రో ధరలపై రైతులు మండిపడుతున్నారు. ఈ ధరల ప్రభీవం వ్యవసాయ రంగంపై తీవ్రంగా ఉందన్నారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌కు చెందిన కార్యకర్తలు మంగలవారం ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. పెరుగుతున్న ఇంధన ధరలను తగ్గించాలంటూ వాళ్లు పంజాబ్‌లోని సమ్రాలా పట్టణంలో ర్యాలీ తీశారు. వేలాది మంది రైతులు.. రోడ్ల విూదకు ట్రాక్టర్లను తీసుకువచ్చారు. అయితే పెట్రో ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నదని మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ తెలిపారు. వరుసగా 16వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. ధరల నియంత్రణ కోసం తాత్కాలిక చర్య కాకుండా దీర్ఘ కాలిక చర్య కోసం కృషి చేస్తున్నామన్నారు.