పెద్దేముల్ కేజీబీవీలో ఘనంగా దీపావళి వేడుకలు

 

పెద్దేముల్ అక్టోబర్ 20 (జనం సాక్షి)
పెద్దేముల్ కేజీబీవీ విద్యార్థులు మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తాండూర్ మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆనవాయితీ గా నిర్వహించే దీపావళి ఈ సంవత్సరం కూడా ఆనంద్ సబ్ కే లియే దీపావళి వేడుకలను సంబరంగా నిర్వహించారు.270 మంది విద్యార్థులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా మార్వాడి యువమంచ్ సభ్యులు మాట్లాడుతూ… ప్రతి ఏటా ఆనంద్ సబ్ కే లియే దీపావళి వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులతో సంబరాలను జరుపుకోవడం గొప్ప అనుభూతినిస్తుందని తెలిపారు.విద్యార్థినిలకు క్రికెట్ కిట్ ఇప్పిస్తామని, విహార యాత్రకు తీసుకెళ్లే ఆలోచన చేస్తామని అన్నారు.పాఠశాలకు రెండు హైమస్ట్ లైట్లను అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పరమేశ్వరి, పీఆర్టీయూ కార్యదర్శి నవీన్, మార్వాడి మంచ్ తాండూరు అధ్యక్షులు బ్రిజ్ మోహన్ బూబ్, కార్యదర్శి కిషన్ గోపాల్ రాఠి, కోశాధికారి అరుణ్ సార్డా, పవన్ సోని, మహేష్ సార్థా, దీనేష్ పని, విద్యార్థులు పాల్గొన్నారు.