పెద్ద ఏడ్గి లో పంటలను పరిశీలించిన ఏడీఏ

జుక్కల్, ఆగస్టు26,జనంసాక్షి,
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్ద ఏడ్గి గ్రామ శివారులో శుక్రవారం బిచ్కుంద వ్యవసాయ సహాయ సంచాలకులు నూతన్ కుమార్ పత్తి, సోయా పంటలను పరిశీలించారు. పత్తి ,సోయా పంటలలో అక్కడక్కడ రసం పీల్చే పురుగును గుర్తించారు. ఆ పురుగు నివారణకు గాను తీసుకోవలసిన చర్యలను రైతులకు వివరించారు. అందుబాటులో వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ఉంటారని వారిని అడిగి రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు.ఎరువులు,పురుగు మందు దుకాణదారుల సలహాలు పాటించరాదని తెలిపారు..
ఎరువులు ,పురుగు మందులు తీసుకున్నప్పుడు రైతులు ఖచ్చితంగా దుకాణదారుల వద్ద రశీదు తీసుకోవాలని తెలిపారు.రైతులు ప్రస్తుతం వేసిన పంటలను వ్యవసాయ విస్తీర్ణ అధికారుల వద్ద నమోదు చేయించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గంగు నాయక్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి సులోచన,రైతులు పాల్గొన్నారు.