పెద్ద టాక్లీలో పాఠ్య పుస్తకాలు పంపిణీ
నిజామాబాద్,ఆగస్ట్10(జనంసాక్షి): మద్నూర్ మండలంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కొనసాగుతున్నది. మండలంలోని టాక్లీ గ్రామంలో మంగళవారం నాడు పాఠశాలలో సర్పంచ్ రాజాబాయ్ విలాస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ యాదవరావు పాటీల్, వార్డ్ మెంబర్ గైక్వాడ్ దిలీప్‌కుమార్, పాఠశాల చైర్మెన్ మాధవ్, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.