పెనుబల్లి నీలాద్రీశ్వరస్వామి గుడిలో చోరీ
ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండల కేంద్రంలో నీలాద్రీశ్వరస్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. గుడి తాళాలు పగులగొట్టిన దుండగులు హుండీలోని పైసలు. బంగారం, వెండినగలు దొంగతనం చేశారు. ఉదయం ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నా పోలీసులు క్లూస్‌టీంను రప్పించి దర్యాప్తు చేస్తున్నారు.