పెన్షన్ పెంచాలి
వినుకొండ, జూలై 11 : వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్లు పెంచేవరకు దశల వారీగా ఉద్యమించాలని సిపిఐ మండల కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పారు. వినుకొండ మండలంలోని కొప్పుకొండ తండా వాసులు సిపిఐకి మద్దతు పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వినుకొండ మండలంలోని 15 గ్రామాల్లో పెన్షన్‌దారుల కమిటీలు వేశామని, పెన్షన్ పెంపుదల కోసం నిర్వహించే అన్ని పోరాట కార్యక్రమాల్లో వినుకొండ మండలంలోని వృద్ధులు, వికలాంగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కాశిం, రాంబాబు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.