పెన్షన్ విద్రోహ దినాన్ని జయప్రదం చేయండి
టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిలాల్
టేకులపల్లి, ఆగస్టు 30( జనం సాక్షి): ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యు ఎస్ పి సి) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న జరిగే పెన్షన్ విద్రోహ దినాన్ని జయప్రదం చేయాలని టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు హరిలాల్ కోరారు. మంగళవారం టి పి టి ఎఫ్ టేకులపల్లి మండల అధ్యక్షులు వాసం భాస్కర్ రావు అధ్యక్షతన టేకులపల్లి లోని ప్రాథమిక పాఠశాలలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సెప్టెంబర్ 1న మండలాల్లో, జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన తెలుపుతూ జిల్లా కలెక్టర్ కి మెమోరాండం సమర్పించడం జరుగుతుందని, సెప్టెంబర్ 4న జిల్లా కలెక్టరేట్ దగ్గర నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు, సెప్టెంబర్ 11 నుండి 23 వరకు హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమాలకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ను పునరుద్ధరించాలని, జీవో నెంబర్ 317 పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, జీవో నెంబర్ 317 13 జిల్లాల బాధ్యత స్పౌజ్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, టిఆర్టి వెంటనే నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలని ,అప్పటివరకు విద్యా వాలంటీర్లను నియమించాలని, ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని, కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని ,గిరిజన సంక్షేమ శాఖలోని కన్వర్టెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మూడు రమణ, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఏ రామ్మూర్తి, జిల్లా కౌన్సిలర్స్ డి ముత్తయ్య, బి రామరాజు ,మండల కార్యదర్శులు బి శ్రీనివాస్, జి నంద, పి వెంకటేశ్వర్లు ఎం వెంకటరామయ్య, మండల