పెన్ పహాడ్ మండలం

వీఆర్ఏల వినూత్న నిరసన
ఫోటో రైటప్: మోకాళ్లపై నిలబడి నిరసన తెలుపుతున్న వీఆర్ఏలు
  పెన్‌పహాడ్‌ . ఆగస్ట్ 27 (జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్  వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలని మండల కేంద్రంలో రాష్ట్ర వీఆర్ఏల సంఘం పిలుపుమేరకు నిర్వహిస్తున్న  34వ రొజు నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం వీఆర్ఏలు మోకాళ్లపై గంటకు పైగా   నిలబడి వినూత్నంగా నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా  వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు  పఠాన్ జానీపాషా మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యలు పరిష్కరించని పక్షంలో మునుగోడులో రానున్న ఉప ఎన్నికల్లో  100 మంది విఆర్ఏ లతో  నామినేషన్ వేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు వెంటనే  పే స్కేల్ విధానాన్ని అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని,57సంవత్సరాలు నిండిన వీఆర్ఏలకు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు  ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మధుసూదన్, ప్రధాన కార్యదర్శి మీసాల పద్మ నాగయ్య, కోశాధికారి పఠాన్ జానీ పాషా, రామకృష్ణ, ముత్తయ్య, వెంకటయ్య, జానయ్య, జాన్ మియా, వీరయ్య, రామయ్య, ప్రభాకర్, పిచ్చమ్మ, ఎల్లమ్మ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు…
———- Forwarded message ———
From: Nagaiah Meesala <[email protected]>
Date: Sat, 27 Aug, 2022, 17:09
Subject: పెన్ పహాడ్ మండలం
To: <[email protected]>
“పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి*ఫోటో రైటప్: లింగాల పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశంలో మాట్లాడుతున్న ప్రధానోపాధ్యాయులు రాములు”పెన్ పహాడ్ ఆగస్టు 27 (జనం సాక్షి) :తల్లిదండ్రులు తమ పిల్లల చదువు పట్ల ఇంటివద్ద శ్రద్ధ వహించాలని ప్రధానోపాధ్యాయులు సిహెచ్ రాములు అన్నారు మండల పరిధిలోని లింగాల ప్రాథమిక పాఠశాలలో శనివారం   తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి మాట్లాడారు   ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెలా మూడో శనివారం తల్లిదండ్రలకు సమావేశం నిర్వహించడం జరుగుతుందని  అన్నారు ప్రభుత్వం అన్ని పాఠ్యపుస్తకాలను ఇప్పటికె అందించడం జరిగిందని ఏకరూప దుస్తులను కూడా మరో వారం రోజుల్లో పంపిణీ చేయనున్నట్టు తెలిపారు ఎస్ఎంసీ చైర్మన్ రణపంగ నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబోధన చేసేటప్పుడు   ఉపాధ్యాయులు తప్పుల్లేకుండా బోధన చేయాలని వెనుకబడిన విద్యార్థులకు  తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా విద్యను అందించాలని పాఠశాలలో మన ఊరు మన బడి ద్వారా ప్రభుత్వం  అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తోందని   తెలిపారు కానీ నూతనంగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు మరల ప్రైవేటు పాఠశాలలకు పంపించొద్దని తల్లిదండ్రులకు సూచించారు ప్రభుత్వం  విద్యాశాఖ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోందని  అన్నారు పాఠశాల అభివృద్ధికి విద్యార్థులకు చదువును అందించడంలో  ఉపాధ్యాయులు  సమన్వయంతో విధులు నిర్వహించాలని కోరారు తల్లిదండ్రులు కూడా ఇంటి వద్ద తమ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు అనేది ప్రతి రోజు తెలుసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ వైస్ చైర్మన్ జూకూరి సరిత,ఉపాధ్యాయులు సుదర్శన్,కిరణ్మయి,   శ్రీనివాసరెడ్డి, గోవింద్,విద్యార్థుల తల్లిదండ్రులు చలిగంటి   స్వప్న, సంధ్య, స్వాతి,శ్రీనివాస్,వెంకటేశ్వర్లు, సైదులు,తిరుపతయ్య,పద్మ,ఎంకమ్మ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు…