*పెబ్బేరు మండలం లో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు*
పెబ్బేరు అక్టోబర్ 09 (జనంసాక్షి): పెబ్బేరు మండలంలో వాల్మీకి మహర్షి సంఘాల ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మున్సిపాలిటీ కేంద్రంలో వాల్మీకి భవనం దగ్గర మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి,పూజలు నిర్వహించారు. స్థానిక సుభాష్ చౌరస్తాలో వాల్మీకి చిత్రపటానికి రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీ స్టీరింగ్ కమిటీ సభ్యులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. రాంపూర్ గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహాన్ని కి పెబ్బేరు ఎస్ ఐ రామస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా రాష్ట్ర ఐక్య కార్యాచరణ స్టీరింగ్ కమిటీ సభ్యులు హరిశంకర్ నాయుడు మాట్లాడుతూ వాల్మీకి మహర్షి రామాయణ కర్త, ఆది కవి గా గొప్ప గురువు అని అభివర్ణించారు. వాల్మీకి మహర్షి వారసుల బోయల వాల్మీకులను ఎస్ టీ జాబితాలోకి మార్చాలని అన్నారు. సర్పంచ్ బస్వరాజు, గోపాల్, సత్యారెడ్డి, ఎమ్ కె మూర్తి, పెబ్బేరు మండల అధ్యక్షుడు మునీశ్వర్ నాయుడు,బలరాం నాయుడు,కుమారస్వామి నాయుడు,సర్పంచ్ గోవింద్ నాయుడు,శ్రీనాథ్, రవికుమార్, క్రాంతి,సత్యనారాయణ,రామకోటి, నరసింహ నాయుడు,సత్యం,వీరస్వామి,మోహన్, గట్టయ్య,కృష్ణ, మహేష్, రవి తేజ,కృష్ణ,రవీందర్,రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు