పెరగనున్న పంటల దిగుబడి

పత్తి, కంది పంటల సాగుతో సానుకూల పరిస్తితి

వరంగల్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): గతేడాది వర్షాలు భారీగా కురవడంతో దిగుబడులు అధికంగా వచ్చాయని.. ఈ ఏడాది కూడా సకాలంలో కురిస్తే సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు దిగుబడులు ఆశించిన స్థాయిలో రాగలవని అంచనా వేస్తున్నారు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం పత్తిసాగు తగ్గించి కంది, పెసర తదితర అపరాల పంటల్ని సాగుచేయాలని సూచించింది. ప్రభుత్వ సూచనల మేరకు రైతులు కంది సాగును పెంచారు. వీటి స్థానంలో పత్తి, మొక్కజొన్న సాగు పెరిగే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది పంటల సాగు పెరగనున్నట్లు అంచనా వేశారు. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, పెసర, మినుము, సోయా తదితర పంటలు సాగవుతాయని అధికారులు తెలిపారు. జిల్లాలోని రైతులు సాగు చేస్తున్న భూముల్లోని మట్టిని పరీక్షించడానికి ప్రభుత్వం జిల్లాకు పది భూసార పరీక్ష మినీ ల్యాబ్‌ కిట్లు వచ్చాయి. గతంలో రైతులు తమ పంట భూముల్లో మోతాదుకు మించి రసాయన ఎరువుల్ని వినియోగించి భూసారాన్ని తగ్గించుకున్నారు. పంటల దిగుబడులు తగ్గిపోవడంతో పాటు

నాణ్యమైన పంటలను పొందలేకపోతున్నారు. మొతాదుకు మించి ఎరువుల్ని వినియోగించ వద్దని..

పకడ్బందీగా భూసార పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు పంటల సాగులో చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు. ఇందులో భాగంగా రైతులకు పంటల మార్పిడి, రాయితీ విత్తనాల గురించి అవగాహన కల్పించారు.