పెరిగిన డిజీల్‌.. తగ్గిన పెట్రోల్‌

1

భారీగా తగ్గిన పెట్రోల్‌ ధర..

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 29(జనంసాక్షి) వాహనదారులకు శుభవార్త. పెట్రోల్‌ ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ చమురు ధరలను అనుసరించి ప్రతి 15 రోజులకు ఒకసారి పెట్రోల్‌ డీజిల్‌ ధరలను సవరిస్తోన్న ఆయిల్‌ కంపెనీలు.. ఈసారి  పెట్రోల్‌ ధరను ఒక లీటరుకు రూ.3.02 వంతున తగ్గించేశాయి. గడిచిన మూడేళ్లల్లో ఒకేసారి ధరను ఇంత మొత్తంలో తగ్గించడం ఇదే మొదటిసారి. పెట్రోల్‌ వాహనదారులకు తీపికబురు చెప్పిన ఆయుల్‌ కంపెనీలు డీజిల్‌ వాహనదారులకు మాత్రం షాక్‌ ఇచ్చాయి. డీజిల్‌ పై రూ 1.47ను పెంపును విధించాయి. సవరించిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమలవుతాయని కంపెనీలు పేర్కొన్నాయి. కాగా కొత్త ధరలను బట్టి చూస్తే హైదరాబాద్‌ లో ఒక లీటరు పెట్రోలు రూ.63.84 నుంచి  రూ. 60.82 పైసలకు తగ్గగా, డీజిల్‌  ధర రూ. 48.44 నుంచి రూ. 49.91కు పెరిగింది. చివరిసారిగా ఫిబ్రవరి 17న ధరలను సవరించిన కంపెనీలు.. పెట్రోల్‌ పై 3 పైసలు, డీజిల్‌ పై 3 పైసలు తగ్గించిన విషయం తెలిసిందే.