పెరిగిన ‘పెట్రో’ ధరలు

2

న్యూఢిల్లీ, ఫిబ్రవరి28(జనంసాక్షి): మరోసారి పెట్రోల్‌, డీజీల్‌ ధరలను భారీగా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. లీటరు పెట్రోల్‌పై రూ 3.18 పైసలు, డీజిల్‌పై రూ. 3.09 పైసలు పెంచింది. పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధర 62 డాలర్లకు చేరడంతో చమురు కంపెనీలు ఈ మేరకు పెట్రో ధరలు పెంచాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల సేల్స్‌ టాక్స్‌, పన్నులు కూడా కలిపితే పెట్రోల్‌పై రూ. 4లు చొప్పున ధరలు పెరిగే అవకాశం ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెట్రో ధరలు పెరగడంతో నిత్యావసర ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.