పెరిగిన బంగారం, వెండి ధరలు
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇక్కడి బులియన్ మార్కెట్లో బంగారం 10 గ్రాముల ధర గత వారంతో పోల్చితే 305 రూపాయలు పెరిగి, 27వేల 335 రూపాయలకు చేరింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. దాంతో ధర కూడా పెరిగింది.
వెండి ధర కిలోకి వెయ్యి రూపాయల వరకు పెరిగింది. వెండి కిలో ధర 37వేల 500 రూపాయలకు చేరింది.