పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు

2
– గడ్కరీ ఆందోళన

న్యూఢిల్లీ,జూన్‌ 9(జనంసాక్షి): ఏటేటా రోడ్డు ప్రమాదాలు పెరగుతున్నాయని, గతేడాదితో పోలిస్తే ఇవి 25 శాతం పెరిగాయని కేంద్రమంత్రి నితీన్‌ గడ్కరీ వెల్లడించారు.  2015లో రోడ్డు ప్రమాదాల గణాంకాలను కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…రోడ్డు ప్రమాదాల్లో అగ్రస్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉండగా, రోడ్డు ప్రమాద మరణాల్లో ఉత్తరప్రదేశ్‌ మొదటిస్థానంలో ఉంది. రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఏడోస్థానంలో, తెలంగాణ పదోస్థానంలో ఉంది. నగరాలవారిగా రోడ్డు ప్రమాదాల్లో ముంబయి మొదటిస్థానంలో, రోడ్డు ప్రమాద మరణాల్లో ఢిల్లీ మొదటిస్థానంలో ఉంది.  దేశవ్యాప్తంగా 30శాతం బోగస్‌ లైసెన్స్‌లు ఉన్నాయని తెలిపారు. రెండు శాతం రహదారులపై 40 శాతం జనాభా ప్రయాణిస్తోంది. 96వేల కి.విూ ఎన్‌హెచ్‌లను 2 లక్షల కి.విూలకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. 20014తో పోలిస్తే 25శాతం రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. 4.6 శాతం మరణాలు పెరిగాయి. రోడ్డు ప్రమాదాల వల్ల గాయపడే వారి సంఖ్యలోనూ 1.4 శాతం పెరిగింది. రోజులకు సగటున 1374 రోడ్డు ప్రమాదాలు, 400 మరణాలు జరుగుతున్నాయి. సగటున గంటకు 57 రోడ్డు ప్రమాదాలు, 17 మరణాలు సంభవిస్తున్నాయి. మృతుల్లో 54.1శాతం మంది 15 నుంచి 34 ఏళ్ల వయస్కులు ఉంటున్నారు. ట్రాఫిక్‌ జంక్షన్లలోనే అత్యధికంగా 49శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రావిూణ ప్రాంతాల్లో 53.8శాతం ప్రమాదాలు, 61శాతం మరణాలు జరుగుతున్నాయని తెలిపారు.