పేదలకు చదువే ఆయుధం

` తెలంగాణకు నూతన విద్యావిధానం అవసరం
` అందుకోసం ఎన్నో సంస్కరణలు తీసుకురావాలి
` ప్రపంచ దేశాలతో విద్యలో తెలంగాణ పోటీ పడాలి
` కేజ్రీవాల్‌ సంస్కరణ వల్లనే మూడోమారు సిఎం అయ్యారు
` తానాఊ అలాగే కావాలని కోరుకుంటున్నా
` గత పాలకులు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారు
` గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణకు నూతన విద్యా విధానం కావాలని,రావాల్సిన అసవరం ఉందని సిఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదని, విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతిసమస్యను పరిష్కరిస్తున్నానని చెప్పారు. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని అన్నారు. విద్యారంగాన్ని గత ప్రభుత్వం వ్యాపారంగా మార్చుకుందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వంలో నూతన నియామకాలు లేవని ఆరోపించారు. గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ- మూతపడే పరిస్థితికి వచ్చిందన్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ శిల్పకళావేదికలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలతో విద్యలో తెలంగాణ పోటీ- పడాలని సీఎం అన్నారు. తెలంగాణకు ఎడ్యుకేషన్‌ పాలసి కావాలని స్పష్టం చేశారు. ఆ పాలసీ పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని సూచించారు. ఢల్లీి మాజీ సీఎం కేజీవ్రాల్‌ మూడో సారి సీఎం కావడానికి కారణం విద్యా రంగంలో ఆయన తెచ్చిన మార్పులే అని గుర్తు చేశారు. తాను కూడా అలా కావాలని అనుకుంటున్నట్లు- సీఎం చెప్పారు. తనకు కూడా రెండో సారి, మూడో సారి సీఎం కావాలని ఉంటుంది అన్నారు. తాను ఫార్మ్‌ హౌస్‌లో పడుకుని మిమ్మల్ని పని చేయమని చెప్పానని, డీజిల్‌ మెకానిక్‌ నేర్చుకుంటే ఉపయోగం ఏంటని, బెంజ్‌ కార్ల కాలంలో అని సీఎం ప్రశ్నించారు. అంబాసడర్‌ కారు కావాలంటే ఫార్మ్‌ హౌస్‌కు వెళ్ళాలని అన్నారు. విద్యార్థుల జీవితాల్లో మార్పులు తీసుకురావాలని యంగ్‌ ఇండియా స్కిల్‌, స్పోర్ట్స్‌ యూనివర్సిటీలు ఏర్పాటు- చేశామన్నారు. విద్యార్థులు గంజాయి, డ్రగ్స్‌ బారిన పడుతున్నారు. డ్రగ్స్‌ మహమ్మారి తాలూకా స్థాయికి చేరిందని అన్నారు. దీనిని అరికట్టడానికి ఈగల్‌ ఫోర్స్‌ ఏర్పాటు- చేశామని చెప్పారు. అందరం కలసి అద్భుతమైన తెలంగాణను నిర్మిద్దామని పిలుపునిచ్చారు. కేజీ టు- పీజీ అంటే గతంలో ఉన్న ప్రభుత్వానికి విూరు సంపూర్ణ మద్దతు అందించారు. కేజీ 2 పీజీ ఉచిత నిర్భంద విద్య అందిందా అని సీఎం ప్రశ్నించారు. మారుమూల ప్రాంతాల్లో స్కూల్స్‌ మూత పడ్డాయో లేదో ఆలోచించాలని అన్నారు. తెలంగాణ నినాదాన్ని, ఉద్యమాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లింది టీచర్‌లని గుర్తు చేశారు. తెలంగాణ సాధనలో క్రియాశీలకంగా వ్యవహరించిన టీచర్‌లు గత పదేళ్లలో ఎన్ని సమస్యలను పరిష్కరించుకున్నారని సీఎం ప్రశ్నించారు. గత పాలకులకు ఉపాధ్యాయుల సమస్యలను ప్రరిష్కరించాలనే ఆలోచన రాలేదు… తమ ప్రభుత్వం వచ్చాకే వారి సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పారు. ప్రజా ప్రతినిధుల ప్రైవేట్‌ వర్సిటీ-లు పెట్టు-కొని వ్యాపారం చేశారని, ప్రభుత్వ వర్సిటీల్లో గత ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదని విమర్శించారు. ఓయూ మూత పడే పరిస్థితికి వచ్చిందని అన్నారు.గురుపూజోత్సవ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు బోధిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్ల కంటే నాణ్యమైన విద్య
అందిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. ఏటా 200 మంది టీచర్లను విదేశాలకు పంపి.. అక్కడి విద్యా విధానం అధ్యయనం చేసేలా ప్రోత్సహిస్తాం. దిల్లీలో కేజీవ్రాల్‌ రెండోసారి సీఎం కావడానికి ఆయన చేసిన విద్యాభివృద్ధే కారణం. నాకూ స్వార్థం ఉంది. టీ-చర్లు బాగా పని చేస్తే నేనూ రెండోసారి సీఎం అవ్వాలనుకుంటు-న్నా. విూతోపాటే నేనూ కష్టపడతా. నేను ఫామ్‌ హౌస్‌లో పడుకుంటా.. మళ్లీ సీఎంను చేయండి అని అనట్లేదు. విద్యాభివృద్ధి కోసం టీచర్లు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. ఐటీఐలు అప్‌డేట్‌ చేసి అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్‌గా మార్చాం. ఏటీసీలో టాటా కంపెనీ కల్పించిన సదుపాయాలు చూస్తే నాకే మతిపోయింది. 140 కోట్ల మంది జనాభా ఉన్న భారత్‌.. ఒలింపిక్స్‌లో ఒక్క స్వర్ణం సాధించలేదు. దక్షిణ కొరియాలో ఒక్క యూనివర్సిటికి చెందిన వారే 16 స్వర్ణపతకాలు సాధించారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీయండి. వారికి ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. క్రీడల్లో రాణించిన క్రికెటర్‌ సిరాజ్‌, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ డీఎస్పీ అయ్యారని రేవంత్‌ తెలిపారు. చాలా చోట్ల కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందడం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయులు క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రతి గ్రామానికి జై తెలంగాణ నినాదాన్ని చేరవేసింది ఉపాధ్యాయులే. జయజయహే తెలంగాణ గీతాన్ని ఆలపించేలా చేశారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులు తమ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకున్నారు? నేనూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే ఈ స్థాయికి వచ్చాను. గతంలో గురుపూజోత్సవం ఎప్పుడైనా జరిగిందా..? అందులో సీఎం పాల్గొన్నారా? తెలంగాణ పునర్నిర్మాణంలో టీ-చర్ల సహకారం కావాలి. పిల్లలు ఎక్కువ సమయం టీచర్ల వద్దే ఉంటారు. పిల్లలతో కలిసే టీచర్ల మధ్యాహ్న భోజనం చేయాలి. వర్సిటీలకు వీసీలను నియమించడానికి గత ప్రభుత్వానికి తీరిక లేదు. ప్రస్తుతం ప్రభుత్వం, టీ-చర్ల చొరవతో కొత్తగా 3 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ప్రైవేట్‌ స్కూళ్ల టీ-చర్ల కంటే.. ప్రభుత్వ టీచర్లకు నైపుణ్యం ఎక్కువ. వివాదాస్పదమైన విద్యాశాఖ తీసుకోవద్దని నాకు కొందరు సూచించారు. అయినా వినకుండా ఈ శాఖను నా వద్దే ఉంచుకున్నా అని రేవంత్‌రెడ్డి అన్నారు.చాలా మంది ముఖ్యమంత్రులు ఫైనాన్స్‌, ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖలను తమ దగ్గర పెట్టు-కుంటారు. కానీ తాను విద్యాశాఖను తన దగ్గర పెట్టు-కున్నట్లు- తెలిపారు. అత్యంత వివాదాస్పద శాఖ విద్యా శాఖ.. అది తనకు వద్దని పలువురు చెప్పారు… కానీ వివాదాస్పదం సంగతి చూద్దామనే తన దగ్గర పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమైన శాఖ అని.. అందుకే దానిని తాను పర్యవేక్షిస్తున్నట్లు- చెప్పారు. కొంత మంది అవగాహన రాహిత్యంతో ఈ శాఖకు మంత్రిని పెట్టమని డిమాండ్‌ చేస్తున్నారని అన్నారు. విమర్శలకు ఒకటే మాట చెప్తున్నా… ఈ శాఖలో ఉన్న సమస్యల పరిష్కారం కోసమే దీనిని తన దగ్గర పెట్టుకున్నట్లు- స్పష్టం చేశారు.గత ప్రభుత్వంలో గురుపూజోత్సవం జరిగిందా.. ఆ కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి వచ్చారా అని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. విూ లాంటి టీ-చర్‌లు చెప్పిన చదువు నేర్చుకునే ఈ స్థాయికి వచ్చానని ఆయన అన్నారు. ఉపాధ్యాయులను చిన్నచూపు చూసే ఆలోచన ప్రజాప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువగా ఉన్న, తక్కువగా ఉన్న ప్రైవేట్‌ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారని, దీనికి కారణం అయితే తాను కావాలి లేదంటే ఉపాధ్యాయులు అయ్యి ఉండాలని అన్నారు. ప్రైవేట్‌ స్కూల్స్‌లో కన్నా ప్రభుత్వ స్కూల్‌ టీ-చర్‌లు అధికంగా చదువుకున్నవారు.. ఇకపై సర్కార్‌ స్కూల్స్‌లో పిల్లల నమోదు సంఖ్య పెరగాలని అన్నారు. స్కూల్స్‌లో మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అందుకే ప్రతి ఏడాది రూ.130 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులు పాఠశాలలో క్లీనింగ్‌కు కేటాయించినట్లు- పేర్కొన్నారు. ఫుడ్‌ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురవడం తనకు బాధ కలిగిందని సీఎం అన్నారు. ఇకపై ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని.. అప్పుడప్పుడు తాను కూడా వచ్చి విూతో, విద్యార్థులతో కలిసి భోజనం చేస్తానని సీఎం అన్నారు.

 

2.భూభారతితో సమూల మార్పులు
` పోర్టల్‌తో ధరణి దుర్మార్గాలకు అడ్డుకట్ట
` వీఆర్‌వో, వీఎవోల రద్దు వెనక పెద్ద కుట్ర
` జీపీవోలకు నియామక పత్రాలు అందించిన సిఎం రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):ధరణి వివరాలు ప్రజలకు తెలియకూడదని గత ప్రభుత్వం వీఆర్‌వో, వీఆర్‌ఏలను తొలగించిందని సిఎం రేవంత్‌ రెడ్డి విమర్శించారు. అందుకే ధరణి తప్పులను భూభారతితో సరిచేశామని అన్నారు. లేకుంటే వారి దుర్మార్గాలు తెలిసేవి కావని అన్నారు. ధన, భూదాహంతో భూమిని చెరబట్టాలని ధరణి తీసుకొచ్చారు. వారి దోపిడీకి అడ్డుగా ఉన్నారని వీఆర్‌వో, వీఆర్‌ఏలను తొలగించారు. నిజానికి తెలంగాణలో అన్ని పోరాటాలు భూమి చుట్టూనే తిరిగాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కొమురంభీమ్‌, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, రావి నారాయణరెడ్డి తదితరులు భూమి కోసమే పోరాడారని తెలిపారు. భూమికి, తెలంగాణ ప్రజలకు మధ్య ఉన్న బంధం.. తల్లీబిడ్డకు ఉన్న సంబంధమన్న ఆయన.. భూమిని ఆక్రమించుకోవాలని చూసిన వారిని తెలంగాణ ప్రజలు తరిమికొట్టారన్నారు. గ్రామ పరిపాలన అధికారులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం చేతులవిూదుగా జీపీవోలకు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమంలో రెవెన్యూ సిబ్బంది ఉవ్వెత్తున పాల్గొన్నారని అన్నారు. రాష్ట్ర సాధనలో రెవెన్యూశాఖ సిబ్బంది కీలకపాత్ర పోషించారని చెప్పారు. ఉద్యమంలో పాల్గొన్న సిబ్బందికి గత సీఎం మేలు చేస్తారని అందరూ ఆశించారని, కానీ ఆరోపణలు తట్టుకోలేక సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజలను దోచుకున్నది రెవెన్యూ ఉద్యోగులే అన్నట్లు గత ప్రభుత్వం చిత్రీకరించిందన్నారు. రెవెన్యూశాఖ కావాలని పొంగులేటి అడగలేదు. వారి సమర్థత గుర్తించి ఇచ్చాం. ధరణితో పట్టు-కున్న దరిద్రాన్ని.. భూభారతితో తొలగించే ప్రయత్నం చేశాం. ప్రజలకు రెవెన్యూ అధికారుల వల్ల సమస్యలు రాలేదు. ధరణి వల్లే సమస్యలు వచ్చాయి. ప్రజల సమస్యలు పరిష్కరించాలంటే జీపీవోలు అందుబాటులో ఉండాలి. సాదాబైనామాల సమస్యలను అధికారులు పరిష్కరించాలని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఏ చిన్న లోపం లేకుండా అన్ని రాష్టాల్రకు ఆదర్శంగా ఉండేలా భూభారతి చట్టం తయారుచేశామని తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పేదవాడి భూములకు భరోసా ఇచ్చేలా ఈ చట్టాన్ని రూపొందించామన్నారు. ధరణి ద్వారా ఏర్పడిన సమస్యలను గత ప్రభుత్వం పరిష్కరించలేదు. భూ భారతి చట్టం చేసే సమయంలో సీఎం నిద్రలేని రాత్రులు గడిపారు. మా ప్రభుత్వంలో అధికారులే ప్రజల వద్దకు వెళ్లి భూ సమస్యలు పరిష్కరించారు. ప్రజలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సమస్యలు పరిష్కరించాం. చెప్పిన మాట వినలేదని గత ప్రభుత్వాధినేత గ్రామ రెవెన్యూ వ్యవస్థను రోడ్డున పడేశారు. కానీ, ప్రజాప్రభుత్వం మాత్రం గ్రామాల్లో రెవెన్యూ అధికారుల నియామకానికి శ్రీకారం చుట్టింది. డిసెంబర్‌ చివరిలో భూభారతి వెబ్‌సైట్‌లోని రికార్డులను ప్రింట్‌ తీసి ప్రదర్శిస్తాంఅని పొంగులేటి తెలిపారు.

 

తెలంగాణలో మెడికల్‌ ఈక్విప్‌మెంట్‌ యూనిట్‌
` ఏర్పాటుకు జర్మనీ కంపెనీ ఆసక్తి
` సిఎం రేవంత్‌తో సంస్థ ప్రతినిధుల భేటీ
హైదరాబాద్‌(జనంసాక్షి):జూబ్లీహిల్స్‌ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని జర్మనీకి చెందిన బెబిగ్‌ మెడికల్‌ సీఈవో జార్జ్‌ చాన్‌ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. తెలంగాణలో మెడికల్‌ ఎక్విప్‌ మెంట్‌ ఉత్పత్తి యూనిట్‌ ను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నట్లు జర్మన్‌ కంపెనీ తెలిపింది. తెలంగాణలో మెడికల్‌ ఎక్విప్‌ మెంట్‌ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు- చేసేందుకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌ తెలిపారు..అనువైన స్థలం, ఇతర అంశాలకు సంబంధించి అధ్యయనం చేసి రిపోర్టు అందించాలని అధికారులకు సిఎం ఈ సందర్భంగా సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్‌ ఎక్విప్‌ మెంట్‌ తో పాటు-, క్యాన్సర్‌ చికిత్సకు ఉపయోగపడే రేడియేషన్‌ సెంటర్స్‌ను ఏర్పాటు- చేయాలని కంపెనీ ప్రతినిధులను సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు.

దేశంలోనే గణేశ్‌ ఉత్సవాలకు ఖైరతాబాద్‌ ప్రసిద్ధి: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): ఖైరతాబాద్‌ మహాగణపతిని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి సీఎం ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు.అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.‘’71 ఏళ్ల క్రితం గణేశ్‌ ఉత్సవ సమితి ఒకే ఒక్క అడుగు గణేశుడిని ప్రతిష్ఠించుకుని ఉత్సవాలను ప్రారంభించింది. దేశంలోనే గణేశ్‌ ఉత్సవాలకు ఖైరతాబాద్‌ ప్రసిద్ధి చెందింది. ఒక్కసారి నిర్వహణే కష్టమైన ఈరోజుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకుంటూ ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఉత్సవాలను కొనసాగిస్తోంది. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా, ఇప్పుడు సీఎంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో గణేశ్‌ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ అందించింది. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ఎక్కడా సమస్యలు లేకుండా ఉత్సవాలను పూర్తిచేసుకున్నాం. ఉత్సవాలను విజయవంతంగా ముగించిన గణేశ్‌ ఉత్సవ సమితి సభ్యులను అభినందిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్సవ సమితికి అన్ని విధాలుగా సహకారం అందిస్తాం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.