పేదలకు డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడ

నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

స్టేషన్ కు తరలివచ్చిన పేదలు పోలీసులతో వాగ్వాదం.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 29. (జనం సాక్షి) అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని కోరుతూ సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. ఆందోళన కొనసాగుతున్న క్రమంలో పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిరుపేదలకు న్యాయం చేయాలని కోరితే అక్రమంగా అరెస్టు చేయడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులలు సిపిఎం జిల్లా కార్యదర్శి మషం రమేష్. కోడం రమణ, ఎలిగేటి రాజశేఖర్ లను అరెస్టు చేసిన క్రమంలో పేదలు పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లారు. పేదలకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టిన నాయకులను విడుదల చేయాలని కోరుతూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలీసులు నచ్చి చెప్పడంతో శాంతించి శాంతించి వెనుతిరిగారు.