పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి భరోసా.

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
ఫోటో రైటప్: సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులతో ఎమ్మెల్యే చిన్నయ్య.
బెల్లంపల్లి, అక్టోబర్21, (జనంసాక్షి)
పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి భరోసా ఇస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 19 మంది లబ్దిదారులకు ₹ 12,14,000 చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గరిబోళ్లకు అండగా ఉంటాడని దీనికి నిదర్శనంగా ఒకేసారి 19 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందించమే అన్నారు. ఈకార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా – శ్రీధర్, కన్నెపల్లి జడ్పీటీసీ సత్యనారాయణ, తాండూరు జడ్పీటీసీ సాలిగామ బానయ్య, ఆకెనపల్లి ఎంపీటీసీ సుభాష్ రావు, నియోజకవర్గం ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, టీఆరెస్ నాయకులు పాల్గొన్నారు.