పేదల పెద్ద కొడుకు వైఎస్‌ఆర్‌..

పేదలకు పెద్దకొడుకుగా ప్రతీ ఒక్కరి సమస్య తీర్చుకుంటూ,వారికి అండగా దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి ఉన్నారని ,ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికి ఆదర్శమేనని షర్మిల అన్నారు.ముదిగోండ మండలంలో మొదటి రోజు పూర్తి చేసుకున్న షర్మిల పాదయాత్ర రెండవరోజు మంగళవారం నేలకొండపల్లి మండలం రాయిగూడెం,బుద్దారం,చెరువు మాదారం గ్రామంలో కొనసాగింది.ఈ సందర్బముగా చెరువుమాదారం గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ పేదలకోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని ,ఆపథకాలే నేటికి ఆదర్శంగా నిలిచాయని,రేపు కూడా ఆదర్శంగానే నిలుస్తాయన్నారు.రానున్న కాలంలో జగన్‌ సీఎం అయితే తిరిగి అన్ని పథకాలను ప్రారంబిస్తామని ఆమె ప్రజలకు హమీ ఇచ్చారు.పార్టీ నుంచి విడిపోయారనే కోపంతో జగనన్నను కాంగ్రెస్‌ పార్టీ కావాలనే జైలు పాలు చేసిందని ఆరోపించారు.కుట్రలతోనే జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నాళ్లకైనా నిజాయితీ గెలుస్తుందని,జగనన్న బయటకు రావడం ఖాయమన్నారు.
రాజన్న రాజ్యం కోసం నడుంబిగిద్దాం
ప్రజలకోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రాజన్న ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరం పాటు పడదామని, రాజన్నరాజ్యం కోసం నడుం బిగిద్దామని షర్మిల పిలుపునిచ్చారు.సమస్యలు ఏకరువు పెడుతున్నప్పటికి పట్టించుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెప్పాలని,బంగాళకాతంలో పడేసి రాజన్న కలల రాజ్యాన్ని తెచ్చుకుందామన్నారు.రాజన్న రా జ్యం రాకపోతే రానున్న కాలమంతా మనం నరకం చూడాల్సి వస్తుందని,కడుపేదలు కడుపుకోసం వలస బాట తప్పదన్నారు. జగన్‌ సీఎం అయితే రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల బతుకులు మారిపోతాయని షర్మిల స్పష్టం చేశారు. చెరువు మాదారం గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో వికలాంగలు,వృద్దులు,గ్రామస్తులతో ఆమె మాట్లాడారు. గ్రామ సమస్యలు,వికలాంగుల సమస్యలను ఆమె అడిగి తెల్సుకున్నారు. పంటల పరిస్థితిని ఓ రైతును అడగ్గా కన్నీరు పెట్టుకుని సాగర్‌ నీటిని విడదల చేయకపోవటంతో పంట అంత ఎండిపోయిందని తెలిపారు.ఈ సందర్బముగా గ్రామ సమస్యలను తెల్సుకున్న షర్మిల ప్రజలనుద్దేశించి మాట్లాడారు.వికలాంగులకు,వృద్దులకు వెయ్యి రూపాయల పెన్షన్‌లను అందిస్తుందని,ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకునేందుకు నివాసగృహలు మంజూరు చేస్తామని హమీ ఇచ్చారు.
అడుగడుగునా నీరాజనం..
నేలకొండపల్లి మండలం రాయిగూడెం గ్రామంలో ప్రారంబమైన రెండవరోజు పాదయాత్ర విజయవంతంగా కొనసాగింది. సుమారు 10 కిలోమీటర్ల దూరం పాటు సాగిన పాదయాత్రలో షర్మిలకు అడుగడుగునా నిరాజనం పలికారు.మహిళలు గ్రామ గ్రామానికి తిలకం దిద్ది హరతులుపట్టి గ్రామాల్లోకి ఆహ్వనించారు. మా ఇంటి ఆడపడుచు
వచ్చిందని దిష్టితీసి స్వాగతం పలికారు.జిల్లా నలుమూలల నుంచి వందలావి మంది కార్యకర్తలు తరలిరావడంతో రహదారులు వైసీపి జెండాలతో నిండిపోయింది.
వైఎస్‌ విగ్రహల ఆవిష్కరణ
రాయగూడెంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌,జవహర్‌లాల్‌నెహ్రు విగ్రహలకు షర్మిల పూలమూలలు వేసి నివాళ్లు అర్పించారు.అనంతరం చిన్నారిని తీసుకుని ముద్దాడి,ఏడుస్తుంటే ఓదార్చింది. మంచి ఉద్యోగం సాధించి గ్రామానికి పేరు తీసుకురావాలని ఆశీర్వదించారు.అనంతరం ప్రారంబమైన పాదయాత్ర రాయిగూడెం గ్రామం శివారుకు చేరింది. అక్కడ ఎండిపోయిన చెరకు ,వరి,మిర్చి పంటలను పరిశిలించారు. చెరకు రైతును వివరాలు అడిగి తెల్సుకున్నారు.
అనంతరం బుద్దారం గ్రామానికి చేరుకున్న షర్మిల వైఎస్‌ఆర్‌ విగ్రహనికి పూలమాలు వేసి నివాళ్లు అర్పించారు. అక్కడ
నుంచి ప్రజలకు అబివాదం చేసుకుంటూ పాదయాత్ర కొనసాగించారు. చెరువు మాదారంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గోన్నారు.ప్రజల సమస్యలను తెల్సుకున్నారు.అనంతరం నేలకొండపల్లి సమీపాన బసచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్‌ మచ్చా శ్రీనివాసరావు,ఖమ్మం పార్లమెంట్‌ ఇన్‌చార్జీ పోంగులేటి శ్రీనివాస్‌రెడ్డి,ఖమ్మం
ఇన్‌చార్జీ పువ్వాడ అజయ్‌కుమార్‌,పాలేరు,పినపాక,కొత్తగూడెం ఇన్‌ఛార్జీలు రామసహయం నరేష్‌రెడ్డి,పాయం వెంకట
ఎడవెల్లికృష్ణ,జిల్లానాయకులు తాటి వెంకటమదన్‌లాల్‌,శీలం వెంకటరెడ్డి,తోట రామారావు,పాదయాత్ర కోఆర్డీనేటర్‌ సాదు రమేష్‌రెడ్డి,అధికార ప్రతినిది బొబ్బిలి భరత్‌చంద్ర,జిల్లా సీంటరీంగ్‌ కమిటీ సభ్యులు వెంక మండల కన్వీనర్లు కోటేశ్వర్‌రావు,బజ్జూరి వెంకట్‌రెడ్డి,నాయకులు సైదాడ్డి నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గోన్నారు.