పేదల వైద్యం.. అత్యంత ప్రాధాన్యం
` ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.2,408 కోట్లు చెల్లించాం
` గత ప్రభుత్వం 600 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లింది
` విద్య,వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం
` సీఎంఆరఎఫ్ నిధులను దుర్వినియోగం చేశారు
` అన్ని బాగోతాలు బయటపెట్టబోతున్నాం
` అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):గత బీఆరఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి రూ.600 కోట్లు బకాయిలు పెట్టి వెళ్తే తాము ప్రతినెలా రూ.89 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు రూ.2,408 కోట్ల బిల్లులు చెల్లించామని అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. ఏడో రోజైన గురువారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. ఆరోగ్య శ్రీ కింద ప్రభుత్వాసు పత్రులకు రూ.927 కోట్లు, పైవేట్ ఆస్పత్రులకు రూ.1,480 కోట్లు చెల్లించామని చెప్ప్పుకొచ్చారు. 27 నెలల్లో పేదల వైద్యం కోసం రూ.4,500 కోట్లు చెల్లించామని ఆయన వివరించారు. పేదలకు అన్యాయం జరుగుతోందని విపక్షాలు అపోహలు సష్టిస్తున్నాయని.. బీఆరఎస్ గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎలా దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసంటూ విమర్శించారు. ఎవరి పీఏలు సీఎం రిలీఫ్ ఫండ్ కాజేశారో కూడా తెలుసంటూ చురకలు అంటించారు. గత ప్రభుత్వంలో సీఎంఆరఎఫ్ నిధులను కొందరు తమ సొంత ఖాతాల్లో వేసుకున్నారని, దీనిపై విచారణ జరుగుతోందన్నారు. త్వరలోనే అన్నీ బయటకు వస్తాయని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చాక 27 నెలల్లో రూ.2,046 కోట్ల సీఎంఆరఎఫ్ కింద ఇచ్చామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అప్ప్పుల భారాన్ని తమకు వారసత్వంగా ఇచ్చిందని, ఆ బకాయిలను తామే చెల్లిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆరఎస్ గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం నెలకు రూ.52 కోట్లు ఖర్చు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నెలకి రూ.89 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ఆరోగ్య శ్రీ ఇవ్వకపోవడం వల్ల చికిత్స చేయట్లేదు అనేది అపోహ మాత్రమే అన్నారు. ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. విద్యా, వైద్యం విషయంలో కోతలు ఉండవని సీఎం రేవంత్ మరోసారి తేల్చి చెప్పారు. కోతలు పెట్టాల్సి వస్తే వేరే కోతలు పెడతామని అన్నారు. టీచింగ్ కాలేజీల నిర్వహణ గ్రూప్`1 అధికారులకు అప్పగిస్తామని, ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేందుకు కొత్త పథకం తీసుకు వస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు.విద్య, పేదల వైద్యం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వైద్యానికి నిధులు కేటాయించి రాష్టాన్ని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో రూ.2,046 కోట్ల విలువైన సీఎంఆరఎఫ్ చెక్కులను పంపిణీ చేశామని చెప్పారు. గతంలో ఈ చెక్కుల విషయంలో అవినీతి జరిగిందన్నారు. 27 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పేదల వైద్యం కోసం రూ.4,500 కోట్లు చెల్లించామన్నారు. టీచింగ్ కాలేజీలకు రోగులు వెళ్లడం లేదని సీఎం అన్నారు. ఈ కాలేజీల నిర్వహణను గ్రూప్`1 అధికారులకు అప్పగిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేందుకు కొత్త పథకం తీసుకొచ్చామని వివరించారు. విదేశాల్లో నిపుణులైన వైద్యుల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. గోషామహల్‌లో 30 ఎకరాల్లో రూ.3వేల కోట్లతో ఉస్మానియా ఆస్పత్రి నిర్మిస్తున్నామన్నారు. ఆ పనులు వేగంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు.
సీఎసఆర్ నిధుల సమీకరణ, వినియోగానికి ప్రత్యేక విధానం
` అభివద్ధి, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టే కార్పొరేట్ సంస్థలను ప్రభుత్వం తరఫున అభినందించాలి
` తెలంగాణలో కంపెనీలు ఏర్పాటు చేసి, సీఎసఆర్ నిధులను వేరే చోట ఖర్చు పెడితే ఎలా?
` ఇప్పటి వరకు వచ్చిన నిధులు ఆశించిన స్థాయిలో లేవు: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎసఆర్) నిధులు సవిÖకరణతోపాటు, వాటిని సమర్థంగా వినియోగించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎసఆర్ నిధులతో రాష్ట్రంలో అభివద్ధి, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టే కార్పొరేట్ సంస్థలను ప్రభుత్వం తరఫున అభినందించాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో సీఎసఆర్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని కార్పొరేట్ కంపెనీలు సీఎసఆర్ నిధులతో చేపడుతున్న కార్యక్రమాల వివరాలు, అన్ని ప్రభుత్వ విభాగాల్లో అందుబాటులో ఉన్న ప్రాజెక్టులు, సీఎసఆర్ ద్వారా చేపట్టేందుకు వీలున్న కార్యక్రమాల వివరాలను సమన్వయం చేసే బాధ్యత రాష్ట్ర స్థాయి సెల్ నిర్వహిస్తుందని చెప్పారు. ప్రభుత్వానికి, కార్పొరేట్ సంస్థలకు అనుసంధానంగా ఉండేలా ప్రత్యేకంగా సీఎసఆర్ పోర్టల్ రూపొందించాలని ఆదేశించారు.ఇప్పటి వరకు వచ్చిన సీఎసఆర్ నిధులు ఆశించిన స్థాయిలో లేవని, తెలంగాణలో కంపెనీలు ఏర్పాటు చేసి, సీఎసఆర్ నిధులను వేరే చోట ఖర్చు పెడితే ఎలా? అని సీఎం అన్నారు. రాష్టానికి మరిన్ని నిధులు రావాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలోని కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు ఇచ్చే నిధులు వినియోగమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్టాల్లో సీఎసఆర్ సవిÖకరణకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలన్నారు.


