పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
పిఏసిఎస్ డైరెక్టర్ చిట్టిమల్ల రజిత.
మంగపేట సెప్టెంబర్ 24 (జనంసాక్షి):-
ములుగు జిల్లా అధ్యక్షులు,జడ్పీ చైర్మన్,నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీశ్వర్ ఆదేశాల మేరకు,మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మినారాయణ ఆదేశానుసారం
మంగపేట మండలంలోని బుచ్ఛంపేట రెషన్ షాపు వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన దసరా పండుగ కానుకగా బతుకమ్మ సంబరాల చీరలను రేషన్ లబ్ధిదారులైన పలువురు మహిళలకు పిఏసిఎస్ డైరెక్టర్ చిట్టిమల్ల రజిత, డీలర్ జబ్బ కవిత శనివారం పంపిణీ చేయటం జరిగింది.ఈ సందర్భంగా పిఏసిఎస్ డైరెక్టర్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాజకీయాలకు, కులమతాలకు తావు లేకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని,ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ఒక సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.బతుకమ్మ పండుగ కానుకగా ఆడబిడ్డలకు సారేను అందిస్తున్నట్లు తెలిపారు. మహిళల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించినారు,కార్యక్రమంలో అంగనువాడి టీచర్లు,తెరాస గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి బూరుగుల వేంకటమల్లు,మందల ఉప్పలయ్య, మండల బీసీ సెల్ ఉపాధ్యక్షుడు నక్క యాకయ్య,మండల రైతు కమిటీ ఉపాధ్యక్షుడు సామ మల్లారెడ్డి,తెరాస గ్రామ మహిళ అధ్యక్షురాలు సామ రేణుక,రైతు కోఆర్డినేటర్ పన్నాల కొండలరెడ్డి, హేమలత,మండల యూత్ ఉపాధ్యక్షులు మండల రమేష్, సామ యుగేందరెడ్డి,కొంపెల్లి ముకుందం,ఎర్ర వెంక్కన్న,పాన్నాల నాగిరెడ్డి,ఎర్ర సైదులు,రాచకొండ వెంకటయ్య,పిట్టల సాంబయ్య, కాసోజు వేంక్కన్న, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు