పేదల సంక్షేమానికి కట్టుబడ్డాం

5
భూములు అమ్మడం అనివార్యం

సీలేరుపై వాటా వదులుకోం

మైనారిటీల హక్కులు పరిరక్షిస్తాం

సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మార్చి17(జనంసాక్షి): వ్యవసాయంపై ఆధారపడ్డ దళితులకు మూడెకరాలు ఇవ్వాలన్న హావిూకిఒ కట్టుబడి ఉన్నామని, వారి ఆర్థిక ప్రగతికి కట్టుబడి ఉన్నామని సిఎం కెసిఆర్‌ శాసనసభలో స్పష్టం చేశారు. అలాగే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, భూమలు అమ్మకం,సీలేరుపై హక్కు, అంగన్‌వాడీలకు సన్నబియ్యం,విద్యుత్‌ సమస్య తదితర అంశాలపై సిఎం ముక్కుసూటిగా సమాధానం ఇచ్చారు. దళితులకు భూమి ఇవ్వాలన్న విషయంలో ఎలాంటి వెనకడుగు లేదన్నారు. దీనికోసం నిధులు విడుదల చేసి, వ్యవసయా యోగ్యమైన భూమినే కొటున్నామని అన్నారు. అయితే ఇచ్చిన భూమి నిరుపయోగం కాకుండా అది ఉపయోగకరంగా ఉండేలా చూస్తున్నామని అన్నారు. ప్రతిజిల్లాలో నిధులు ఉన్నాయని, వీటితో భూములు కొని వారికి ఇవ్వడమే గాకుండా వారిని వ్యవసయాకంగా అభివృద్ది చేస్తామన్నారు. ఇందుకు అనగుణంగానే  దళిత సంక్షేమ శాఖ తన దగ్గరే పెట్టుకున్నట్లు  కేసీఆర్‌ తెలిపారు. శాసనసభలో కేసీఆర్‌ మాట్లాడుతూ దళితుల పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉందని, స్వాతంత్యం వచ్చిన తర్వాత కూడా వారి పరిస్థితి మారలేదన్నారు. దళితులకు భూమి కొనుగోలు వ్యవహారంలో అపోహలు వద్దని కాంగ్రెస్‌ హయాంలో భూములు ఇచ్చారు గానీ… కుంటలు ఇచ్చారని, సకల వసతులతో 3 ఎకరాల కమతం ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్‌ అన్నారు. తొలి దశలో మొత్తం భూమి లేని దళితులకు భూములు కొనిస్తామన్నారు. ఎకరం ఉన్నవారికి 2ఎకరాలు, 2 ఎకరాలు ఉన్నవారికి ఎకరం కొనిస్తామన్నారు. అంతేగాకుండా వారిని వ్యవసాయకంగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరగొద్దని ఎస్సీవెల్ఫేర్‌ శాఖను తనతోనే ఉంచుకొని మానిటరింగ్‌ చేస్తున్నట్లు సీఎం చెప్పారు. దళితుల భూములకు సంబంధించి సభ్యులు తమ నియోజవర్గానుంచి దరఖాస్తులు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి లేవనెత్తిన ఓ విషయాన్ని సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారు. గతంలో ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూమిని కూడా ఇప్పటి ప్రభుత్వం వ్యవసాయానికి అనుకూలంగా చేయాలని, వారికి కూడా బోరు వేయించి సంవత్సరం పాటు ఖర్చులు భరించాలని జీవన్‌రెడ్డి చేసిన సూచనను సీఎం అభినందించారు. చాలా మంచి సూచన దాన్ని పాజిటీవ్‌గా తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వాలైనా సదుద్దేశంతో ఇచ్చిన భూమి నిరుపయోగంగా ఉండొద్దని, ఒక వేళ అటువంటివి సభ్యులు తమతమ నియోజకవర్గాల్లో ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండని కోరారు.

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టిస్తాం

ఇక డబుల్‌ బుడ్‌రూమ్‌ ఇళ్లు కట్టిస్తామన్న హావిూకి కట్టుబడి ఉన్నామన్నారు. 100శాతం కొత్త కాలనీల నిర్మాణం చేపట్టనున్నామని, 2 పడకల ఇళ్లు నిర్మించి ఇచ్చి తీరుతామన్నారు.  ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు డబుల్‌ బెడ్‌రూమ్‌ను కచ్చితంగా కట్టిస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.  పెండింగ్‌లో ఉన్న ఇళ్లను కూడా పూర్తి చేస్తామని ప్రకటించారు. అక్రమంగా బిల్లులు ఎత్తుకున్న వారి నుంచే డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులతోనే పెండింగ్‌ ఇళ్లను పూర్తి చేస్తామని తేల్చిచెప్పారు. ఇందిరమ్మ ఇళ్లల్లో మోసాలకు పాల్పడిన వారి నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం

మంజూరు చేసి పెండింగ్‌లో ఉన్న ఇళ్లను తెలంగాణ సర్కారు తప్పకుండా పూర్తి చేస్తుందని సీఎం హావిూ ఇచ్చారు. గతంలో చాలా అవకతవకలు జరిగిన విషయాన్ని సీఐడీ బయట పెట్టిందని, ఎవరైతే అక్రమంగా బిల్లులు ఎత్తుకుని తిన్నరో వారి నుంచి కక్కించి పెండింగ్‌ ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పారు. ఇందులో ఎంత పెద్దమనుషులైనా వదలమని చెప్పారు.  వాస్తవానికి దగ్గరగా ఉండేలా రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాల్లో కోతలు విధించిందని తెలిపారు. అదే విధంగా కొంత మేర రాష్టాల్రకు అదనపు నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారని చెప్పారు. ఈ సారి రూ. 96 వేల కోట్ల ప్రభుత్వ రాబడి కచ్చితంగా వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బ్యాంక్‌ బాలెన్స్‌ ప్రకారం బడ్జెట్‌ ప్లానింగ్‌ ఉంటుందన్నారు.

భూముల అమ్మకం చేపడతాం

హైదరాబాద్‌లో ఇప్పుడిప్పుడే రియల్‌ ఎస్టేట్‌ పుంజుకుంటోందని సీఎం చెప్పారు. హైదరాబాద్‌ చుట్టూ 10 వేల ఎకరాల అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతమయ్యాయని తెలిపారు. అన్యాక్రాంతమయ్యేందుకు అవకాశమున్న భూములనే ప్రభుత్వం అమ్ముతుందని పేర్కొన్నారు. ఈ సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు కల్పించుకుని భూములు అమ్మొద్దని అన్నారు. సీఎం స్పందిస్తూ విూరు భూములు అమ్మలేదా? తాము అమ్మితినే తప్పా అని ప్రశ్నించారు. భూముల అమ్మకం కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచే వస్తోందని గుర్తు చేశారు. రూ. 79 వేల కోట్లతో పవర్‌ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని సీఎం స్పష్టం చేశారు. వాటర్‌గ్రిడ్‌ కోసం సుమారు రూ. 33 వేల కోట్లు ఖర్చు అవుతాయని తెలిపారు.   సింగరేణిలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, బీడీ కార్మికులకు కనీస జీవన భృతి కోసమే పింఛన్లు అందజేస్తున్నామని, త్వరలో అంగన్‌వాడీలకు సన్నబియ్యం సరఫరా చేస్తామని ఈ సందర్భంగా కేసీఆర్‌ స్పష్టం చేశారు. తాము గతంలో ఎంతమొత్తుకున్న దొడ్డ ప్రభువులు దొడ్డు బియ్యం సరఫరా చేసారని, తాము సన్నగా ఉన్నందున సన్నబియ్యం ఇస్తున్నామని అన్నారు. అంగన్‌వాడీలకు కూడా త్వరలో వీటిని సరఫరా చేస్తామన్నారు. రెండు, మూడు నెలల్లో అంగన్‌వాడీలకు కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. ఇప్పుడున్న చట్టం మేరకు వారికి పరిహారం ఇస్తున్నారని కలెక్టర్‌ దగ్గర వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తల్లిదండ్రులను విస్మరించిన ఉద్యోగులు ఉంటే వారి  జీతాల నుంచి నెలకు రూ. వెయ్యి కట్‌ చేసి తల్లిదండ్రులకు ఇస్తామని ప్రకటించారు.

సీలేరుపై హక్కు వదులకోం

ఒక నెల దాటేస్తే తమకు కరెంట్‌ కోతలుండవన్నారు.  కృష్ణపట్నంతో రూ. 2,500 కోట్లు మిగిలిపోయాయన్నారు.  విద్యుత్‌ విషయంలో సీలేరుపై న్యాయపోరాటం చేద్దామన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకుని వెళదామన్నారు. దీనిని వదులుకునే ప్రసక్తి లేదన్నారు. ఈ సీజన్‌లో ఒక్క నెలరోజులు ఉంటే గింటే కష్టం ఉంటదని, అదికూడా లేకుండా చేయడానికి వందశాతం ప్రయత్నం చేస్తున్నామని సీఎం చెప్పారు. 5 వందల మెగావాట్ల విద్యుత్‌ను ఇటీవలే కొన్నామని దాని ఉత్తర్వులు త్వరలోనే వస్తాయని, కేంద్రం నుంచి మనకు కేటాయించిన గ్యాస్‌ అందుబాటులోకి వస్తుందని, దాని వల్ల మూడు వందల మెగావాట్ల కరెంటు వస్తుందని, గాయత్రి పవర్‌ ప్రాజెక్టు నుంచి కూడా కొంత వస్తుందని

చెప్పారు. ఇదంతా ఈ సమ్మర్‌ సీజన్‌ పీక్‌ టైంలో అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈదొక్క సీజన్‌ గట్టెక్కితే ఇక మనకు కరెంటు సమస్య ఉండదని సీఎం చెప్పారు. విపక్షాలు లోపాలు వెతకడం కంటే నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తే స్వీకరిస్తామని సీఎం సూచించారు. దయచేసి లోపాలను వెతికడం మాని నిర్మాణాత్మకమైన సూచనలు చేయండని సీఎం కేసీఆర్‌  మరోసారి ప్రతిపక్షాలను కోరారు. ప్రభుత్వ చేస్తున్న మంచి పనుల్లో రంద్రాణెళ్విషణ చేయకుండా ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని కోరారు. సభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్‌ ఎంతో ఓపికగా, బాధ్యతాయుతంగా సమాదానాలు చెప్పారు.

ఉర్దూ పోస్టుల భర్తీ

ఉర్దూ విద్యాసంస్థల్లో త్వరలోనే భర్తీ చేస్తామని అక్బరుద్దీన్‌ అడిగిన ప్రశ్నకు సీఎం సమాదానం చెప్పారు.అలాగే మైనార్టీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌ షిప్పులు ఇస్తామని సీఎం చెప్పారు. షాదీ ముబారక్‌పై కొత్త గైడ్‌లైన్స్‌ ఇస్తామని చెప్పారు. ఆప్షనల్‌ లాంగ్వెజ్‌గా ఉర్దూను సైతం ప్రవేశపెడతామని కేసీఆర్‌ సభలో చెప్పారు. 9.6 కోట్లతో నిజామియా యూనివర్సిటీలో ఆడిటోరియం నిర్మిస్తామని హావిూ ఇచ్చారు. అంతకు ముందు జీవన్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క అడిగిన ప్రశ్నలకు సమాదానంగా బీడీ కార్మికులకు బృతి అతి త్వరలోనే కల్పిస్తామని చెప్పారు. విడాకులు తీసుకున్న మహిళలకు కూడా ఫించన్లు ఇవ్వాని వారు అడిగిన ప్రశ్నక సమాధానంగా… దీనివల్ల ఇతర సమస్యలు వస్తామని, దీన్ని ఏ సమస్యలేకుండా ఎలా చేయోలా అందరూ కూర్చుని చర్చించి నిర్ణయం తీసుకుందామని చెపారు. లాగే విద్యుత్‌పైనా సభ్యులు లేవనెత్తి అనుమానాలను సీఎం నివృత్తి చేశారు.  మైనార్టీ విద్యార్థులకు ప్రీమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు ఇస్తామని తెలిపారు. ఆప్షనల్‌ లాంగ్వేజ్‌గా ఉర్దూను ప్రవేశపెడుతామని చెప్పారు. రూ. 9.60 కోట్లతో నిజామియా యూనివర్సిటీలో ఆడిటోరియం నిర్మిస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దర్గాలన్నింటికీ పూర్వవైభవం తెస్తామని స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్‌ లెవల్‌ లో హజ్‌ సెంటర్లను నిర్మిస్తామని హావిూనిచ్చారు. షాదీముబారక్‌పై త్వరలో గైడ్‌లైన్స్‌ ఇస్తామని సీఎం పేర్కొన్నారు. వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతానికి గురైన విషయం విదితమే. అన్యాక్రాంతమైన భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.