పేదల సొంతింటి కల సాకారం చేసి తీరుతాం
– ఏపీ మంత్రి నారాయణ
తూర్పుగోదావరి, జులై 2(జనం సాక్షి ) : ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా… ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా పేదల సొంతింటి కల సాకారం చేసి తీరుతామని ఆంధప్రదేశ్ మంత్రి నారాయణ స
/-పష్టం చేశారు. సోమవారం గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి… జిల్లాలోని మండపేట, రామచంద్రపురంలో నిర్మిస్తున్న పేదల గృహాలను పరిశీలించారు. ఆగస్టు నెలలో పేదల గృహప్రవేశానికి సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అత్యుత్తమమైన షీర్ వాల్ టెక్నాలజీతో నిర్మించిన ఈ గృహాలు… భూకంపాలు, వరదలు, తుఫాన్లకు తట్టుకుని నిలబడతాయని మంత్రి వెల్లడించారు. ప్రతిపక్షాలు పనిగట్టుకుని పేదల ఇళ్లపై దుష్పచ్రారం చేస్తున్నాయని మండిపడ్డారు. పేదలకు నాణ్యమైన ఇళ్లను నిర్మించడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి ఎన్ని అడ్డుంకులు సృష్టించిన తట్టుకొని చంద్రబాబు నాయుడు సమర్థతతో పాలన సాగిస్తున్నారని మంత్రి తెలిపారు. ఒక పక్క రాష్ట్ర రాజధాని నిర్మాణంతో పాటు, ప్రముఖ కంపెనీలు ఏపీకిలోకి రావడంతో పాటు, మరోపక్క రాష్ట్రంలోని వ్యవసాయ రంగం, పేదల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించారని తెలిపారు. రాబో
యఏ కాలంలో ఏపీని దేశానికే ఆదర్శంగా నిలిపేలా చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతున్న కేంద్రాన్ని విమర్శించాల్సిన ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై పోరాడుతూ అభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబును విమర్శించడం విడ్డూరంగా ఉందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల తీరును ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.