పేదింటి పెళ్లికి పెద్దన్న కేసీఆర్.
బెల్లంపల్లి, అక్టోబర్ 21, (జనంసాక్షి)
పేదింటి పెళ్లికి పెద్దన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇంట్లో పెళ్లీడు కొచ్చిన అడపిల్లలు ఉంటే గుండెల మీద కుంపటిగా భావించేవారని, ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కష్టాలు చూసి ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రులకు భారం కావద్దనే ఉద్దేశంతో షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ పథకాలను ప్రారంభించి పేదింటికి పెద్దన్నగా నిలిచాడన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా 65 మంది లబ్ధిదారులకు ₹ 65,07,540 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా – శ్రీధర్, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, ఆకెనపల్లి ఎంపీటీసీ సుభాష్ రావు, నియోజకవర్గం ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, తహసీల్దార్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, టీఆరెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.