పేద ముస్లింలకు 4.5 శాతం ఉపకోట

మంత్రి రహమాన్‌
న్యూఢిల్లీ,మార్చి 24 (జనంసాక్షి) : వెనుకపడిన ముస్లింలకు 4.5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలిని ప్రభుత్వం నిర్ణయిందని అయితే ఇది సుప్రీంకోర్టులో పెండింగ్‌ ఉందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కె.రహమాన్‌ ఖాన్‌ ఆదివారం చెప్పారు. నేషనల్‌ ఎడిటర్స్‌ సమావేశంలో ఆయన మాట్లా డారు. ఎన్నికల ప్రణాళికలో ముస్లింలకు అంటే పేదముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామ ని కాంగ్రెస్‌ వాగ్దానం చేసిందని గుర్తు చేశారు. కేరళ, కర్నాటకలలో చేసినట్లు ఉద్యోగాల కోటాలో ఇది ఉపకోటా అన్ని చెప్పారు. అక్కడి హైకోర్టులు కూడా ఈ నిర్ణయాన్ని సమర్ధించాయన్నారు. కాని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషన్‌ అక్కడి హైకోర్టు తిరస్కరించిందన్నారు. కేసు సుప్రీంలో పెండింగ్‌లో ఉందన్నారు. తాము ఈ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్నారే. 2011, డిసెంబర్‌ 23న కేంద్ర మంత్రి వర్గం ఓబీసీ కోటా అయిన 27 శాతం రిజర్వేషన్లలో మైనారిటీలకు 4.5 శాతం ఉపకోటాకు నిర్ణయించిందన్నారు.