పేద రైతులకు గోశాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో లేగ దూడలు పంపిణీ

 

డోర్నకల్ ప్రతినిధి అక్టోబర్ 16( జనం సాక్షి):దుక్కి దున్నడం మొదలు పంట కోత వరకు మెకానైజేషన్‌‌పై రైతులు ఆధారపడక తప్పడం లేదు.ట్రాక్టర్లు, యంత్రాల కిరాయిల ధరలు కూడా పెరిగడంతో పెట్టుబడి తడిసి మోపడవుతుంది.ఇంధన ధరలు సైతం ఇప్పుడు రైతులకు అధనపు భారంగా మారాయి.ఈ సందర్భంలో పేద రైతులకు అండగా ఉండేది కాడెద్దులు.విద్యుదఘాతంతో, ఇతర కారణాలవల్ల రైతులు కాడెద్దు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న తరుణంలో రైతులకు కొన్ని గోశాల తోడుగా నిలిచాయి.
నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామంలో గోశాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పదిమంది నిరుపేద రైతులకు 20 లేగదుడను పంపించేశారు. ఈ సందర్భంగా గోశాల ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు మహేష్ అగ్రవాల్ మాట్లాడుతూ… గోశాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నిరుపేద రైతులను గుర్తించి వ్యవసాయం సాగుతోపాటు రసాయనిక ఎరువులు నిషేధించి సేంద్రియ ఎరువులు వాడకం పెంచడం కోసం ప్రతి రైతుకు గోవును పంపిణి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శివ పార్వతి గోశాల మండల అధ్యక్షులు సుధాకర్, డాక్టర్ రంగారావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.