పేద విద్యార్థినిలకు ఉపకార వేతనాల పంపిణీ.

 

– రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర వారి ఆధ్వర్యంలో…

బూర్గంపహాడ్ ఆగష్టు 26 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక ఐటీసీ అనుబంధ సంస్థ రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర వారి ఆధ్వర్యంలో స్థానిక ఆడిటోరియంలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థునులకు ఉపకార వేతనాన్ని అందజేశారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు దాదాపు లక్ష రూపాయల నగదును వాళ్ళ తల్లిదండ్రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు రో” టి సూర్య భాస్కర రావు మాట్లాడుతూ పిల్లలు కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవడమే తమ లక్ష్యమని దాని కొరకు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినిలకు ఉపకార వేతనాన్ని అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి రో” డాక్టర్ విజయ్, రో” శ్యామ్ కిరణ్ రో” షేక్ బాషా, రో” ఎన్. సత్యనారాయణ రోటరక్టర్స్ షేక్ ఖాదర్ వలీ, నంతియ, మన్మధరావు, రేష్మ, గిరీష్ ఐటీసీ గుత్తేదారులు సత్యనారాయణ, ప్రసాద్, మురళి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.