పేద విద్యార్థులకు అండగా మేమున్నాము.
బూచన్ పల్లి గ్రామ సర్పంచ్ జయ దయాకర్.
మర్పల్లి, సెప్టెంబర్ 23 (జనం సాక్షి)
విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందించడంలో ముందుంటామని, విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బుచన్ పల్లి గ్రామ సర్పంచ్ జయ దయాకర్ అన్నారు. శుక్రవారం రోజున గ్రామ సర్పంచ్ జయ దయాకర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరవింద్, ప్రేమ్ కుమార్ లు కలిసి బూచన్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఐడి కార్డ్స్, మోడల్ పేపర్స్, టై, బెల్టులు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధునాచారి వారికి అభినందించి, మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం తో సమాజ మార్పుకు శ్రీకారం చుట్టినట్లే అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మధునాచారి, అరవింద్, ఉపాధ్యాయులు రాజేందర్, ఫాతిమా, పుష్పకుమారి తదితరులు పాల్గొన్నారు.