పేద విద్యార్థులకు చేయూతనివ్వడం స్ఫూర్తిదాయకం: శ్రీధర్‌బాబు
కరీంనగర్‌్, సెప్టెంబర్1 (జనంసాక్షి):
పేద విద్యార్థులకు చేయూతనివ్వడం స్పూర్తిదాయకమని జిల్లా మంత్రి శ్రీదర్‌బాబు అన్నారు. శనివారం నగరంలోని ఇందిరా గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఆర్వీఎం పీవో గంగారెడ్డి కుమా రుడు వెల్ముల సృపేన్‌రెడ్డి స్మారక ఫౌండేషన్ ఏర్పాటు కార్యమ్రకంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ ఆర్థిక కారణాల వల్ల చదువు మధ్యలో ఆపేసిన పేద విద్యార్థులను చేరదీసి ఉన్నత చదువులను అందించడానికి ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలను చేపట్టిన గంగారెడ్డి కుటుంబానికి ఆయన మద్ధతు తెలిపారు. ఈ ఫౌండే షన్‌కు భవిష్యత్తులో ఎలాంటి అవసరం కావల్సి వచ్చినా తాను సహాయం చేయడానికి ముందుం టానని తెలిపారు. అంతకుముందు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన అనంత రం సృపేన్ స్మారక గీతాల ఆడియోను ఆవిష్కరించిన ఎంపీ పొన్నం ప్రభాకర్ వెబ్‌సైట్‌ను ప్రారం భించారు. ఈ సందర్భంగా సృపేన్ స్మారకార్థం అతని స్నేహితులు అయిదు పాఠశాలలకు 21 వేల రూపాయలను ఆపాఠశాలల లైబ్రరీ కొరకు విరాళంగా ఇచ్చారు. ఆ సంస్థ లక్ష్యాలను డాక్యు మెంటరీ రూపంలో ప్రదర్శించారు. అనంతరం ఎంపీ పొన్నం మాట్లాడుతూ ఆయన జ్ఞాపకాలను పేద విద్యార్థుల చదువుల రూపంలో చూసుకొనే ప్రయత్నం చేయడం నిజంగా హర్షనీయమన్నారు. ఎస్పీ రవీందర్ మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థి పేదరికం కారణంగా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో ఇలాంటి మంచి పని చేయడం గర్వకారణమన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, అదనపు జేసీ సుందర్ అబ్నార్, సునీల్ రావు, గుజ్జుల క్రిష్ణారెడ్డి, సంతోష్ కుమార్, కన్న క్రిష్ణ, జనంసాక్షి ఎండీ షేక్ అబూబకర్ ఖాలీద్, రాఘవేంద్రరావు, సోమ సుందరరెడ్డి, సాగి సంతోష్ కుమార్, ె మహేశ్, కొండూరి రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.