పొంగిపొర్లుతున్న కమాన్ పూర్ పెద్ద చెరువు
కల్వర్టు పైనుంచి భారీగా వరద నీరు.. – నిలిచిపోయిన రాకపోకలు జనంసాక్షి, కమాన్ పూర్ : గత నాలుగు, ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దపెల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన కమాన్పూర్ పెద్ద చెరువు పొంగిపొర్లుతున్నది. తూములు మత్తడి ద్వారా పెద్ద ఎత్తున వరద నీరు బయటకు వస్తుండడంతో సిద్ధిపల్లె జిపి పరిధిలోని శాలపల్లె కల్వర్టు పైనుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తున్నది దీంతో శాలపల్లె, బుర్రకాయలపల్లె, పెంచికల పేట తదితర గ్రామాలకు కమాన్ పూర్ మండల కేంద్రానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి