పొచ్చెరలో ఘనంగా ఆషాఢ బోనాలు
బోథ్ జూన్ 30 (జనంసాక్షి) మండలంలోని పొచ్చెర గ్రామంలో గురువారం ఆషాఢ బోనాల కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటా కొత్త కుండలో బోనాల వండుకుని చిన్నా పెద్దా అందరు ముస్తాబై బాజా భజంత్రీలు నడుమ గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతీ యేటా ఈ కార్యక్రమం సాగుతూ వస్తోందని, బోనాలు సమర్పించి తమను సల్లంగ చూడమని పాడి పంటలను కాపాడాలని వేడుకుంటామన్నారు.