పొన్నాలకు అన్యాయం చేస్తే ఊరుకోం: కాంగ్రెస్
జనగామ,నవంబర్12(జనంసాక్షి): జనగామ ఎన్నికలలో టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని స్థినిక కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. కావాలనే పొన్నాలను పక్కకు పెడితే ఊరుకోబోమన్నారు. ఆయన గెలుపునకు కార్యకర్తలు చిత్తశుద్ధితో పాటుపడాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ మండలాధ్యక్షులు అన్నారు. రాజకీయంగా పొన్నాలను దెబ్బతీయాలనే కుట్రలు ఏమాత్రం పనిచేయవన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కృషిచేస్తూ జనగామలో నాలుగుసార్లు గెలిచి కంచు
కోటగా మార్చడంతో పాటు అభివృద్ధి ప్రధాతగా నిలిచిన పొన్నాల గెలుపును అడ్డుకోలేరన్నారు. కార్యకర్తలు అయో మయం వీడి ఇంటింటి ప్రచారం ముమ్మరం చేసి పొన్నాల గెలుపుకు యుద్ధంలో సైనికులవలె పనిచేయాలన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌తో ముత్తిరెడ్డి గెలిచాడని అన్నారు. సమావేశంలో కొమురవెల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు మంకాల సతీశ్, యూత్ మండలాధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్, మాజీ నియోజకవర్గ అధ్యక్షుడు నాగమల్ల శ్రీనివాస్, నాయకులు అంబటిపల్లి బుచ్చిలింగం, మ్యాకల యాదగిరి, సార్ల లింగం, కొయ్యడ శ్రీనివాస్, మకిలి కనకయ్య, మల్లం బాలయ్య, ఎంకి కనకయ్య, సుధాకర్, వెంకట్‌రెడ్డి, శిఖా సత్తయ్య, రాములు, జనగామ శ్రీకాంత్, శ్రీను, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.