పొన్నాల జైలుకు వెళ్లడం ఖాయం
– జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది పొన్నాలే
– శాసనమండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు
వరంగల్, అక్టోబర్31(జనంసాక్షి) : మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య జైలుకు వెళ్లడం ఖాయం అని శాసనమండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. పొన్నాల లక్ష్మయ్య సీఎం కేసీఆర్ విూద చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ ను చర్లపల్లి జైలుకు పంపుతానంటావా? పొన్నాలే అతి త్వరలో జైలుకు వెళ్లడం ఖాయం అని అన్నారు.
వరంగల్ జిల్లా మడికొండ అసైన్ మెంట్ భూముల కొనుగోలుపై విచారణ తుది దశలో ఉందని, ఈ వ్యవహారంలో పొన్నాలకు జైలు తప్పదన్నారు. వైఎస్ హాయంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది పొన్నాలే అని విమర్శించారు. సాగు నీటి మంత్రిగా పొన్నాల జిల్లాకు, తెలంగాణకు చేసిందేమి లేదు అని వెంకటేశ్వర్లు మండిపడ్డారు. జనగామలో పొన్నాల ఎన్నికల సమయంలోనే కనిపిస్తారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలే పొన్నాలను నిలదీస్తున్నారని వెంకటేశ్వర్లు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు పవిత్ర స్ధలం అని, అలాంటి ప్రాజెక్టును కూడా పొన్నాల తప్పు పట్టడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ గాంధీ కేసీఆర్ ను పొన్నాల బుడ్డర్ ఖాన్, బఫున్ లా విమర్శిస్తున్నారని, పొన్నాల నొరు అదుపులో ఉంచుకుంటే మంచిదని హెచ్చరించారు. పీసీసీ చీఫ్ ¬దాలో జనగాం నుంచి 38 వేల ఓట్ల తేడాతో పొన్నాల ఓడిపోయాడని ఆయన విమర్శించారు. రైతులంతా టీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో సంతోషంగా ఉన్నారని, దేవాదుల ప్రాజెక్టు ద్వారా జనగాంలో భారీగా చెరువులు నింపిన ప్రభుత్వం మాది అని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే అవినీతి అని, పొన్నాల గురించి జనగామలో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ కోసం పొన్నాల చిత్తశుద్ధితో ఎప్పుడూ పోరాడలేదు అని వెంకటేశ్వర్లు అన్నారు.