పోచమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

నంది వనపర్తి లో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట ఆలయ ప్రారంభోత్సవం

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- యాచారం మండల పరిధిలోని నందివనపర్తి గ్రామంలో పోచమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్ట ఆలయ ప్రారంభోత్సవం కు టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, ఎంపీపీ కొప్పు సుకన్య భాష,సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ రవిందర్ రెడ్డి,ఎంపిటిసి రజిత రాజు నాయక్,ఉప సర్పంచ్ మూడేడ్ల గోవర్ధన్ రెడ్డి,బిఎన్ రెడ్డిట్రస్ట్ చెర్మెన్ బీలకంటి శేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు హాజరై పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదంకి దయాకర్ మాట్లాడుతూ..దేవాలయ నిర్మాణాలు ఆధ్యాత్మిక మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందన్నారు, ఆలయాల పునర్నిర్మాణం తో సామాజిక వర్గాల్లో ఐక్యత ఏర్పడుతుందని ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరినట్లు పేర్కొన్నారు నందివనపర్తి గ్రామం దేవాలయాల పునర్నిర్మాణానికి పుట్టినిల్లని అన్నారు పోచమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జోగిరెడ్డి,వార్డు సభ్యులు అనిత రవీందర్, ఉమా అలెగ్జాండర్,రాధిక శేఖర్,కొండాపురం నాగరాజు,ఆలయ కమిటీ సభ్యులు మరాఠీ యాదయ్య, భూపతి దాసు,శెట్టిమళ్ల శాంతయ్య, బండి ఈశ్వర్,గోరేటి సత్యనారాయణ, మరాఠీ  నర్సింహా,భూపతి రామకృష్ణ, పంబాల యాదయ్య, కాలే యాదయ్య, తెలుగమల్ల ప్రశాంత్,పెరుమల్ల విక్రమ్, పెరుమల్ల బుగ్గరాములు,శేఖర్ తదితరులు పాల్గొన్నారు