పోడు భూముల్లోనే కేసిఆర్ చిత్ర పటానికి రైతులు పాలాభిషేకం

పెనుబల్లి, నవంబర్ 12(జనం సాక్షి)
పెనుబల్లి మండలం గంగాదేవిపాడులో పొడురైతులు శనివారం పత్తి చేలల్లో కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు, ఎన్నొ ఏళ్లుగా గిరిజన రైతులు పోడు కొట్టి అట్టి భూములను సాగు చేసుకుంటున్న భూము లకు,
వచ్చే నెల ఆఖరుకు తమ సొంత పొడుదారులకు పట్టాలు ఇస్తామని కె సి ఆర్ ప్రభుత్వం తెలపటంతో, తమ కష్టానికి ఫలితం రాబోతుందని ఆనందంలో పొడురైతులు సాక్షాత్తు తాము పోడుకొట్టీ సాగు చేసుకుంటున్న భూముల్లో నే తెలంగాణా రాష్ట్ర ముఖ్య మంత్రి కే సి ఆర్ కు కృతజ్ఞతా భావం తో
ఆయన చిత్రపటానికి కోలాహలంగా పాలాభిషేకం చేశారు