పోరాటాలకు అన్ని పార్టీలు మద్దతివ్వాలి : రాఘవులు
కృష్ణా: విద్యుత్తు ఛార్జీలకు సంబంధించి సీఎం చెప్పే వివరణలు సరికావని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. విద్యుత్తు ఛార్జీలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారాయన్నారు. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రికి ప్రజలు ఉత్తరాలు రాయాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఎం దశలవారీగా చేపట్టే ఉద్మమాలకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాలని కోరారు. విద్యుత్తు ఛార్జీలు చెల్లించలేమని ప్రజలు ఎంతగా మొరపెట్టుకుంటున్నా అవేవీ ప్రభుత్వానికి వినిపించడంలేదన్నారు.