పోరాడుతున్న టీమిండియా

కోహ్లీ సెంచరీ               ధోని కెప్టెన్‌ ఇన్నింగ్స్‌         భారత్‌ 297/8
నాగ్‌పూర్‌, డిసెంబర్‌ 15:   నాగ్‌పూర్‌ టెస్టులో మూడోరోజు భారత్‌ పోరాట పటిమ కనబరిచింది. 4 వికెట్లకు 87 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఇవాళ ఇన్నింగ్స్‌ కొనసాగించిన ధోనీ, కోహ్లీ నిదానంగా ఆడారు. క్లిష్టమైన పిచ్‌పై పరుగులు సాధించేందుకు శ్రమించిన వీరిద్దరూ ఇన్నింగ్స్‌ నిర్మించడంలో సక్సెసయ్యారు. సింగిల్స్‌తో ఇంగ్లాండ్‌ బౌలర్లకు విసుగు తెప్పించిన ధోనీ, కోహ్లీ లంచ్‌ వరకూ 59 పరుగులే చేయగలిగారు. అయితే లంచ్‌ తర్వాత కాస్త వేగం పెంచడంతో మెల్లిగా టీమిండియా ఆధిపత్యం పెరిగింది. ఈ క్రమంలో మొదట విరాట్‌ కోహ్లీ సెంచరీ కంప్లీట్‌ చేసుకున్నాడు.  చాలా నిదానంగా ఆడిన కోహ్లీ టెస్ట్‌ కెరీర్‌లో మూడో శతకాన్ని నమోదు చేశాడు. ధోనీ, కోహ్లీ ఐదో వికెట్‌కు 198 పరుగుల భాగస్వామ్యం సాధించారు. అయితే 103 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ దగ్గర అంపైర్‌ సందేహాస్పద నిర్ణయానికి ఎల్బీగా కోహ్లీ ఔటయ్యాడు. దీంతో భారత్‌ఐదో వికెట్‌ కోల్పోయింది. కాసేపటికే రంజీల్లో అదరగొట్టిన రవీంద్ర జడేజా 12 పరుగులకు ఆండర్సన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా ఔట య్యాడు. మరోవైపు సిరీస్‌లో తొలిసారిగా బాధ్యతాయు తంగా ఆడిన ధోనీ కూడా శత కానికి అడుగు దూరంలో రనౌ టవడం అభిమానులను నిరాశ పరిచింది. టెస్టుల్లో ఆరో సెం చరీ అందుకోవాలని ధోనీ పట్టు దలగా ఆడాడు. 90 పరుగుల కు చేరువైన తర్వాత మిగిలిన తొమ్మిది రన్స్‌ అందుకు నేందుకు గంటన్నర సేపు ఆడడాన్ని చూస్తే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయిన ప్పటకీ 99 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ దగ్గర పెవిలియన్‌ చేరుకున్నాడు. మొత్తం మూడు సెషన్ల పాటు నిలకడగా ఆడిన భారత్‌ రోజు చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆధిక్యం సాధించే అవకాశం చేజారింది. ఆఖరి ఓవర్‌లో పియూష్‌ చావ్లా బౌల్డవడంతో భారత్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. ఈ వికెట్‌తో ఆటముగిసిపోవడంతో భారత్‌ 8 వికెట్లకు 297 పరుగులు చేసింది. ప్రస్తుతం రెండు వికెట్లు మాత్రమే చేతిలో ఉన్న టీమిండియా ఇంకా 33 పరుగులు వెనుకబడి ఉంది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో ఆండర్సన్‌ 4, స్వాన్‌ 3 వికెట్లు తీసుకున్నారు.