పోలం బడి, డ్రమ్ సీడ్ పని తీరును పరిశీలించిన జేడీఏ
కమలాపూర్, ఆగష్టు 02, (జనంసాక్షి):కమలాపూర్ మండలంలోని గూనిపర్తి, నేరేల్ల గ్రామాల్లో పోలం బడి, డ్రమ్ సీడ్ పని తీరును గురువారం జేడీఏ బి ప్రసాద్ పరిశీలించారు. అనంతరం ఆయన మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ సహాకార సంఘం భవనంలో ఎరువుల స్టాకు వివరాలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులు ఎరువుల కోసం ఖంగారు పడాల్సిన పని లేదని మండల కేంద్రానికి 370టన్నుల యూరియా, 211టన్నుల డిఎపి, 600టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. మండలంలోని రైతులు ఎరువులను కృత్రిమ కోరత సృష్టించవద ్దన్నారు. రైతులు తమ చేల్లల్లొ కలుపు మొక్కల మందులు వాడేటప్పుడు స్థానికంగా ఉండే వ్యవసాయ అధికారుల సూచన మేరకే పిచ్‌కారి చేయాలన్నారు. వ్యవసాయ యాంత్రికరణ ఏడీ కాంతరావు మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ అందించే సబ్సీడీపై శ్రీ వరి సాగు యంత్రాలు 45హెచ్‌పి ట్రాక్టర్, నాటు వేసే యంత్రాలపై ప్రభుత్వం 50శాతం సబ్సీడీ మేరకు ఇస్తుందన్నారు. కాగా రైతులు ఇట్టి సదవకాశాన్ని ఉపయోగించుకొని అధునిక పద్దతిలో వ్యవసాయం చేసి లాభాలను గడించాలన్నారు. అదేవిధంగా రైతులు గృపులుగా కానీ, వ్యక్తిగతంగా కానీ యంత్రాలను తీసుకోవచ్చాన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ కె దామెర్‌రెడ్డి, ఎవో రాజ్‌కుమార్, ఎఈవో వేణు తదితరులు పాల్గొన్నారు.