పోలవరం భూసేకరణలో వివక్ష: హరీశ్‌రావు
హైదరాబాద్, పోలవరం ప్రాజెక్టు భూసేకరణలో తెలంగాణ రైతుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఈ విషయంపై సీఎంకు లేఖ రాస్తానని ఆయన తెలిపారు. ఆంధ్రా రైతుకు రూ.1.15 లక్షల పరిహారం ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ మంత్రులు ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు.