పోలియోపై మరోమారు యుద్దం

1

– ఈనెల 20 నుంచి 26 వరకు టీకాలు

హైదరాబాద్‌,జూన్‌ 14(జనంసాక్షి):మరోమారు పోలియో జాడలుకనిపించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. పోలియో రహిత భార’ అనుకుంటున్న దశలో ఇక్కడ ఆనవాళ్లు కలవరానికి గురి చేశాయి.  పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వం తివారీ అన్నారు. పోలియో నివారణ అంశంపై మంగళవారం  ఆయన అధికారులతో సవిూక్షించారు. బుధవారం నుంచి ఎన్యుమరేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. ఆరు నెలల నుంచి మూడేళ్ల వయస్సు గల చిన్నారులను గుర్తించి ఈ నెల 20 నుంచి 26 వరకు టీకాలు వేయనున్నట్లు తెలిపారు. దేశంలో పోలియో లేకపోయినా విదేశాల నుంచి వచ్చే వారితో ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకు గాను హైదరాబా’ మహానగరం సహా రంగారెడ్డి జిల్లాలోని 12 మండలాల్లో పోలియో బూ’లు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా అంబంపేట నాలా పరిసర ప్రాంతాల్లోని పీహెకసీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. వైద్యులంతా అప్రమత్తంగా ఉన్నారని, డబ్ల్యూహెకవో, యూనిసెఫ్‌ ప్రతినిధుల బృందం సైతం అందుబాటులో ఉన్నందున ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. పాకిస్థాన్‌ వంటి దేశాల్లో వైరస్‌ ఇంకా ఉందని, హాజ్‌ యాత్రికుల ద్వారా ఈ వైరస్‌ దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున విదేశాల నుంచి వచ్చేవారంతా తప్పకుండా పోలియో టీకాలు వేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  పోలియో వైరస్‌ నివారణ చర్యలపై హైదరాబా’, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, అధికారులతో సవిూక్ష చేశారు. ఈనెల 20 నుంచి 26 వరకు నగరంలో పోలియో చుక్కలు వేయాలని నిర్ణయించారు. పోలియోపై ప్రజలు భయపడాల్సిన అవసరంలేదన్నారు ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వం తివారీ. ఇప్పటివరకు చిన్నారుల్లో పోలియో లక్షణాలు కనిపించలేదని మురుగు నీటి శాంపిల్స్‌ లో మాత్రమే పోలియో లక్షణాలు కనిపించాయని చెప్పారు.