పోలీసులను సన్మానించిన అక్షర పాఠశాల విద్యార్థులు
జగదేవ్ పూర్, అక్టోబర్ 21 (జనంసాక్షి): పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండల కేంద్రమైన జగదేవ్ పూర్ లోని అక్షర పాఠశాల ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ కృష్ణమూర్తితో పాటు పలువురు పోలీసులను పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అక్షర పాఠశాల ఆవరణలో విద్యార్థులు అమర పోలీస్ జవాన్ లకు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం పోలీస్టేషన్ లో ఎస్ఐ ని పోలీసులను సన్మానించి మిఠాయిలను పంచారు. ఈ కార్యక్రమంలో అక్షర పాఠశాల కరస్పాండెంట్ గుర్జకుంట రామస్వామి, పోలీస్ సిబ్బంది, పాఠశాల ప్రిన్సిపాల్ కేశిరెడ్డి సంతోష్ జ్యోతి రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ భైరోజు సుదర్శన్ సిబ్బంది రేణుక ఉపాధ్యాయ బృందం , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.